• స్మగ్లర్లు హీరోలన్న పవన్ కామెంట్స్

  • హరీష్ శంకర్ షాకింగ్ కామెంట్స్

  • సినిమాని చూసి ఇన్ఫ్లూయెన్స్ అవ్వరు: హరీష్ శంకర్

Harish Shankar Responds on Pawan Kalyan Smuggler Heros Comments: కొద్దిరోజుల క్రితం జరిగిన కర్ణాటక అటవీ శాఖ మీటింగ్ లో పవన్ కళ్యాణ్ కీలకమైన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఒకప్పుడు రాజ్ కుమార్ లాంటి హీరోలు అటవీ సంపాదన దోచుకునే వాళ్ళ భరతం పట్టే అటవీశాఖ అధికారులుగా కనిపిస్తే ఇప్పటి హీరోలు మాత్రం స్మగ్లర్లుగా కనిపిస్తున్నారు అంటూ ఆయన కామెంట్లు చేశారు. తాజాగా ఇదే విషయం మీద డైరెక్టర్ హరీష్ శంకర్ స్పందించాడు మిస్టర్ బచ్చన్ ప్రమోషన్స్ లో భాగంగా ఆయన ప్రింట్ వెబ్ మీడియాతో మాట్లాడుతున్న సందర్భంలో ఆయనకు ఈ ప్రశ్న ఎదురైంది. మిస్టర్ బచ్చన్ అనేది ఒక నిజాయితీగల అధికారి కథ అని చెప్పడంతో ఇప్పుడు అంతా డిఫరెంట్ ట్రెండు నడుస్తోంది. స్మగ్లర్లు, క్రిమినల్స్ ను హీరోలుగా చూపిస్తున్నారు అంటూ పవన్ చేసిన వ్యాఖ్యలను హరీష్ శంకర్ ముందు ఉంచితే దానికి ఆయన ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు.

Tollywood: టాలీవుడ్ టుడే టాప్ అప్‌డేట్స్.. జస్ట్ వన్ క్లిక్ లో..

పవన్ కళ్యాణ్ గారికి ముందు నుంచి సామాజిక బాధ్యత ఉంది దానికి తోడు ఇప్పుడు ఆయన అటవీ శాఖ మంత్రి అయ్యారు కాబట్టి ఆ సందర్భంలో అటవీ శాఖలో జరుగుతున్న ఇబ్బందుల గురించి ఒక సినిమా రిఫరెన్స్ తీసుకుని ఉండవచ్చు. కానీ నేను పర్సనల్గా ఎవరు సినిమాని చూసి ఇన్ఫ్లూయెన్స్ అవ్వరు అని అనుకుంటున్నాను, పక్కనున్న స్నేహితుడిని లేదా సంఘటనని చూసి ఇన్స్పైర్ అవుతారు కానీ ఒక సినిమాను చూసి ఇన్ఫ్లూయెన్స్ అవ్వడం అనేది అంత కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను. అయితే ఈ విషయంలో నేను తప్పు కూడా అవ్వచ్చని హరీష్ శంకర్ చెప్పుకొచ్చాడు. పుష్ప సినిమా చూసి సాఫ్ట్వేర్ బ్యాచ్ గొడ్డలి పట్టుకుని తిరుపతి వెళ్ళిపోలేదు కదా. రామారావు గారు రావణాసురుడు పాత్ర చేశాడు అంటే సీతను పట్టుకుని వెళ్లిపోయే పాత్ర ఆయన్ను చూసి హీరో పక్కనోడి భార్యను ఎత్తుకెళ్తున్నాడు అని ఎవరైనా కామెంట్ చేశారా? కాదు కదా. నటుడు అనేవాడు అన్ని రకాల పాత్రలు చేయాలి కదా అంటూ ఆయన కామెంట్ చేశారు.