ప్రభాస్ కి చిరు నుంచి ఊహించని రకమైన విషెస్.. | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings


ఇండియన్ సినిమా ప్రైడ్ హీరో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పుట్టినరోజు నేడు కావడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రభాస్ ఫ్యాన్స్ ఇటు ఆన్ లైన్ అటు ఆఫ్ లైన్ లో హంగామా మాములు రీతిలో చెయ్యడం లేదు. అయితే ప్రభాస్ బర్త్ డేతో సినీ ప్రముఖులు కూడా చాలా మంది తమ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు కానీ మన టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి అయితే తమ మార్క్ లో క్రేజీ విషెస్ ని ప్రభాస్ కి తెలియజేసారు.

“ఆ కట్ అవుట్ చూసి అన్ని నమ్మేయాలి Dude!అతను ప్రేమించే పద్దతి చూసి, తిరిగి అమితంగా ప్రేమించేస్తాం. హ్యాపీ బర్త్ డే డార్లింగ్ ప్రభాస్. నీకు ఎల్ల వేళల శుభ సంతోషాలు, విజయాలతో విరాజిల్లాలని ఈ కొత్త ఏడాది నీకు వండర్ ఫుల్ గా ఉండాలి” అంటూ చిరు తనదైన శైలిలో ప్రభాస్ పై ఒక ఊహించని విషెస్ ని అందించారని చెప్పాలి. దీనితో రెబల్ ఫ్యాన్స్ సహా మెగా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

The post ప్రభాస్ కి చిరు నుంచి ఊహించని రకమైన విషెస్.. first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *