• బిగ్ బి అమితాబ్ బచ్చన్ వెండితెరతో పాటు బుల్లి తెరపై కూడా చెరగని ముద్ర.
  • పాపులర్ క్విజ్ షో ‘ కౌన్ బనేగా కరోడ్‌ పతి ‘ ప్రేక్షకులకు బాగా నచ్చింది.
  • ఈ షో 16వ సీజన్ ఘనంగా ప్రారంభమైంది.

Kaun Banega Crorepati 16 amitabh bachchan: బాలీవుడ్ యాక్టర్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ వెండితెరతో పాటు బుల్లి తెరపై కూడా చెరగని ముద్ర వేశారు. అతని పాపులర్ క్విజ్ షో ‘ కౌన్ బనేగా కరోడ్‌ పతి ‘ ప్రేక్షకులకు బాగా నచ్చింది. ఈ షో 16వ సీజన్ ఘనంగా ప్రారంభమైంది. ఇకపోతే మీడియా కథనాల ప్రకారం.. అమితాబ్ క్విజ్ షో ‘కౌన్ బనేగా కరోడ్‌పతి 16’ ఎపిసోడ్‌కు రూ. 5 కోట్లు వసూలు చేస్తున్నాడు. ఇది గత సీజన్ లో తీసుకున్న మొత్తం కంటే చాలా ఎక్కువ. అమితాబ్ ‘కౌన్ బనేగా కరోడ్ పతి’ మొదటి సీజన్ కోసం ఒక్కో ఎపిసోడ్ కు రూ. 25 లక్షలు చెల్లించారు. ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ ఇతర సీజన్‌లు రావడంతో., నటుడి పాపులారిటీ కూడా పెరిగింది. దాంతో ఆయన రెమ్యూనిరేషన్ కూడా పెరుగుతూ వచ్చాయి.

Cyber Crime : సీబీఐ అధికారిగా నమ్మించి డాక్టర్ దగ్గర రూ.2.8కోట్లు కొట్టేసిన కేటుగాళ్లు

‘కౌన్ బనేగా కరోడ్ పతి’ 15వ సీజన్ ఎపిసోడ్ కు అమితాబ్ రూ.3 నుండి 4 కోట్లు తీసుకున్నట్లు సమాచారం. ‘కౌన్ బనేగా కరోడ్‌పతి 16’ ని సోమవారం నుండి శుక్రవారం వరకు రాత్రి 9 గంటలకు సోనీ టీవీలో చూడవచ్చు. అమితాబ్ చివరిగా ‘కల్కి 2898 AD’ చిత్రంలో ప్రభాస్, దీపికా పదుకొణెలతో నటించారు. ఇందులో అతని నటనకు ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు లభించాయి. రూ.600 కోట్లతో రూపొందిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 1200 కోట్లకు పైగా బిజినెస్ చేసింది. ఇక అమితాబ్ తన రాబోయే చిత్రం ‘వెట్టయన్’ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఈ సినిమా ద్వారా అమితాబ్ తమిళ చిత్రసీమలోకి అడుగుపెట్టనున్నాడు. ఈ చిత్రంలో రజనీకాంత్ కూడా ప్రధాన పాత్రలో కనిపించనున్నారు.