‘అమరన్’ ట్రైలర్.. ఆర్మీ ఆఫీసర్‌గా అదరగొట్టిన శివ కార్తికేయన్ | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings

Published on Oct 23, 2024 6:55 PM IST

తమిళ హీరో శివ కార్తికేయన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘అమరన్’ ఇండియన్ ఆర్మీ మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితకథ ఆధారంగా తెరకెక్కుతోంది. ఈ సినిమాను దర్శకుడు రాజ్ కుమార్ డైరెక్ట్ చేస్తుండగా కమల్ హాసన్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన తెలుగు ట్రైలర్‌ను తాజాగా రిలీజ్ చేశారు.

న్యాచురల్ స్టార్ నాని చేతుల మీదుగా ఈ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ ముకుంద్ వరదరాజన్ జీవిత కథను మనకు ఈ సినిమాలో చూపెట్టనున్నారు. ఆయన ఆర్మీలో చేసిన సేవలు, యుద్ధంలో ఆయన సాహసాలతో పాటు ఎమోషన్‌ని కూడా మనకు చూపెట్టనున్నారు. ఇక ఆయన భార్య పాత్రలో స్టార్ బ్యూటీ సాయి పల్లవి మరోసారి సాలిడ్ పర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకోనుందని ఈ ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.

జివి.ప్రకాశ్ కుమార్ బీజీఎం ఈ ట్రైలర్‌ను నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లింది. పాన్ ఇండియా మూవీగా రాబోతున్న ఈ సినిమాను దీపావళి కానుకగా అక్టోబర్ 31న గ్రాండ్ రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *