• కోల్‌కతా ఘటనపై ఉపాసన కొణిదెల విచారం
  • వ్యక్తిగత ఖాతాలో భావోద్వేగ పోస్ట్
  • ప్రతి స్త్రీకి భద్రత
  • గౌరవం అవసరం.

ఎందరో మహనీయులు తమ ప్రాణాలను పణంగా పెట్టి, రక్తం చిందించి, జైలు జీవితం అనుభవించి, భరతమాత బానిస సంకెళ్లు తెంచి బ్రిటిష్ వాడిని తరిమికొట్టి భారత ఖండానికి స్వాతంత్ర్యం సాధించారు. ఈ పోరాటంలో ఎందరో  నారీమణులు  ఆంగ్లేయులకు ఎదురొడ్డి ఇంగ్లీషోడి కత్తి వేటు శరీరాన్ని చీల్చిన..తమ  చివరి రక్తపు బొట్టు వరకు పరాయిదేశపోడి తల తెగ నరికిన వీర మహిళల పోరాటమే, నేడు యావత్ భారతదేశం చేసుకుంటున్న స్వాతంత్ర్యం సంబరం. కానీ నేడు ఆ వీరనారి అయిన వాళ్ళ చేతుల్లోనే అత్యాచారానికి గురై, మానవ మృగాల వేటకు బలైపోయింది. ఇటీవల కోల్‌కతాలో మహిళా వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటనపై ఉపాసన కొణిదెల విచారం వ్యక్తం చేస్తూ “X” ఖాతాలో పోస్ట్ చేసారు.

Also Read: Mahesh Babu: శ్రీవారి సేవలో సూపర్ స్టార్ కుటుంబ సభ్యులు..

మానవత్వాన్ని అపహాస్యం చేసే ఘటన ఇది. సమాజంలో అనాగరికత పెరిగిపోయింది, అసలు మనం ఎలాంటి స్వాతంత్ర్యం జరుపుకుంటున్నాం, దేశ ఆరోగ్య సంరక్షణకు మహిళలే కీలకం, అటువంటి మహిళలపై రోజు జరుగుతున్న దాడులు చూస్తుంటే గుండె బరువెక్కుతోంది. మనుషుల్లో అసలు మాన‌వ‌త్వం లేదు, మాన‌వ‌త్వాన్నే అప‌హాస్యం చేసే ఘ‌ట‌న కోల్‌కతా జరిగింది. స‌మాజంలో అనాగ‌రిక‌త కొన‌సాగుతుంటే మ‌నం ఎలాంటి స్వాతంత్ర్యాన్ని మనం  జరుపుకుంటున్నామ‌ని ఉపాసన ప్రశ్నించారు.

Also Read : Allu Arjun : స్నేహితుడికి ఎప్పుడు.. ఎలా నిలబడాలి అనేది తెలిసిన ఏకైక వ్యక్తి

భారతదేశంలో ఆరోగ్య సంరక్షణలో మహిళలు ప్రధానపాత్ర పోషిస్తారు. ఈ రంగంలోని వ‌ర్క్‌ఫోర్స్ లో 50 శాతానికి పైగా మ‌హిళ‌లే ఉన్నారు. అంతేగాక ప‌లు అధ్యాయ‌నాలు మ‌హిళా హెల్త్ వ‌ర్క‌ర్లే రోగుల‌తో ఎక్కువ స‌మ‌యం గ‌డుపుతున్న‌ట్లు తేల్చాయ‌ని గుర్తు చేశారు. మ‌హిళ‌లు మ‌న హెల్త్ రంగానికి చాలా అవసరం. అందుకే ఎక్కుమంది మ‌హిళ‌ల‌ను వ‌ర్క్‌ఫోర్స్ లోకి, అందులోనూ హెల్త్‌కేర్ విభాగంలోకి తీసుకురావ‌డం త‌న లక్ష్యం అన్నారు. ఈ విభాగంలో వారి అవ‌స‌రం చాలా ఉంద‌న్నారు. కోల్‌కతాలో జరిగిన ఘటన నా సంకల్పాన్ని మరింత బలపరిచింది. ప్రతి స్త్రీకి భద్రత, గౌరవం అవసరం. మనమంతా కలిసి ఉంటే సమాజంలో మార్పు తీసుకురావచ్చు’ అని అన్నారు ఉపాసన కొణిదెల.