• ఆగస్టు 15న గ్రాండ్ గా రిలీజ్ అయిన డబుల్ ఇస్మార్ట్
  • డీసెంట్ ఓపెనింగ్ రాబట్టిన డబుల్ ఇస్మార్ట్
  • లాంగ్ వీకెండ్ లో మరింత రాబట్టే అవకాశం

రామ్ పోతినేని హీరోగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరెకెక్కిన సినిమా డబుల్ ఇస్మార్ట్. ఆగస్టు 15న థియేటర్లలోకి అడుగు పెట్టాడు ఎనర్టిక్ స్టార్ డబుల్ ఇస్మార్ట్. 2019లో వచ్చిన బ్లాక్ బస్టర్ చిత్రం ఇస్మార్ట్ శంకర్ కు సిక్వెల్ గా వచ్చిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. లైగర్ వంటి భారీ ఫ్లాప్ తర్వాత వచ్చిన ఈ సినిమాపై పూరి ఫ్యాన్స్ తో పాటు రామ్ ఫ్యాన్స్ కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ రిలీజ్ కు రెండు రోజుల ముందు వరకు నైజాం పంపిణి వ్యవహారంలో తకరారు నడిచింది.

Also Read: OTT Movies : థియేటర్లలో రిలీజ్ అయిన వారానికే ఓటీటీలో ప్రత్యక్షమైన సినిమా..

మొత్తానికి అన్ని విఘ్నాలు దాటుకుని రిలీజైన డబుల్ ఇస్మార్ట్ మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది. ఇక ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్ర లలో మొదటి రోజు – 6 కోట్ల రూపాయల షేర్ రాబట్టింది. ఏరియాల వారిగా డబుల్ ఇస్మార్ట్ కలెక్షన్స్ ఒకసారి పరిశీలిస్తే నైజాం – రూ. 2.51 కోట్లు, సీడెడ్ – రూ. 78లక్షలు, ఉత్తరాంధ్ర  –  రూ. 78 లక్షలు, తూర్పు గోదావరి – రూ. 44లక్షలు, పశ్చిమ గోదావరి – రూ. 23 లక్షలు, గుంటూరు – రూ.72 లక్షలు, కృష్ణ – రూ. 38 లక్షలు, నెల్లూరు – రూ. 18 లక్షలు రాబట్టింది. అటు పొరుగు రాష్ట్రం కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి – రూ. 65 లక్షలు, ఓవర్సీసీస్ – రూ. 55 లక్షలు రాబట్టాడు డబుల్ ఇస్మార్ట్. రూ.49 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ గా 4 సినిమాల మధ్య బరిలో దిగిన డబుల్ ఇస్మార్ట్ వరల్డ్ వైడ్ గా రూ.10.85 కోట్లు గ్రాస్ కొల్లగొట్టాడు

నోట్: ఈ కలెక్షన్స్ వివిధ మధ్యమాల ద్వారా సేకరించినవి. వీటిని ఎన్టీవీ ధ్రువీకరించడం లేదు.