ఈ వార్తను అనువదించండి:

తెలంగాణ: ఇండ‌స్ట్రీ, స‌ర్వీస్ సెక్టార్లతో పాటు అన్ని రంగాల్లో విస్తరించే స‌త్తా హైద‌రాబాద్ న‌గ‌రానికి ఉంద‌ని ఫాక్స్ కాన్ ఛైర్మన్ యాంగ్ లియూ అన్నారు. త్వర‌లోనే త‌న బృందంతో క‌లిసి హైద‌రాబాద్ న‌గ‌రాన్ని సంద‌ర్శిస్తాన‌ని చెప్పారు. ఫాక్స్ కాన్ ఛైర్మన్ యాంగ్ లియూ నేతృత్వంలోని ఫాక్స్ కాన్ ప్రతినిధి బృందం ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో శుక్రవారం ఉద‌యం స‌మావేశ‌మైంది. ఈ సందర్భంగా హైద‌రాబాద్ న‌గ‌రానికి ఉన్న చ‌రిత్ర.. పారిశ్రామిక సంస్థల విస్తర‌ణ‌కు ఉన్న అనుకూల‌త‌, అద్భుత‌మైన వాతావ‌ర‌ణ ప‌రిస్థితుల‌ను ఫాక్స్ కాన్ బృందానికి రేవంత్ వివ‌రించారు. ఈ మేరకు 430 ఏళ్ల కింద పునాది రాయి ప‌డిన హైద‌రాబాద్‌ కాల‌క్రమంలో మూడు న‌గ‌రాలుగా అభివృద్ధి చెందిందని, ప్రభుత్వాలు మారినా పారిశ్రామిక అభివృద్ధిలో వైరుధ్యాలు లేక‌పోవ‌డంతోనే హైద‌రాబాద్ వేగంగా పురోగ‌తి చెందుతోంద‌ని వారికి తెలిపారు.

పూర్తిగా చదవండి..