Chiranjeevi: ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకపోయినా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి తన స్వసక్తితో ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు నటుడు చిరంజీవి. నటుడిగా ప్రతి సినిమా సినిమాకు ఎంతో తన నటనను మెరుగుపరుచుకుంటూ ఎన్నో విభిన్న పాత్రలలో నటించారు. ఇలా నటుడిగా ఇప్పటివరకు సుమారు 150 కి పైగా సినిమాలలో నటించిన చిరంజీవి ఎన్నో సినిమాల ద్వారా బ్లాక్ బస్టర్ హిట్ అందుకోగా మరికొన్ని సినిమాలు నిరాశ పరిచాయి.

ఇక చిరంజీవి నటించిన సినిమాలలో ఒక సినిమా షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుని విడుదలకు కూడా నోచుకోలేకపోయింది. అయితే ఈ సినిమా గురించి చాలామందికి తెలియదు. మరి చిరంజీవి షూటింగ్ పూర్తి చేసి విడుదల కానీ ఆ సినిమా ఏంటి అనే విషయానికి వస్తే ఆ చిత్రం మరేదో కాదు శాంతినివాసం. బాబు డైరెక్షన్లో చిరంజీవి మాధవి హీరో హీరోయిన్ గా నటించిన ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తి అయింది.

షూటింగ్ పూర్తి చేసుకున్న తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి అయ్యాయి. ఇక సినిమా విడుదలకు సిద్ధమైందన్న తరుణంలోనే ఈ సినిమా ప్రొడ్యూసర్ మరణించారు. ఇలా నిర్మాత మరణించడంతో కొంతకాలం తర్వాత అయినా ఈ సినిమా విడుదలవుతుందని అందరూ భావించారు కానీ ఈ సినిమాను విడుదల చేయడానికి ఎవరు ముందుకు రాలేదు.

శాంతినివాసం..
ఇలా ఈ సినిమాని విడుదల చేయడానికి ఎవరు ముందుకు రాకపోవడంతో ఈ సినిమా విడుదలకు నోచుకోలేదు. ఇక చిరంజీవి ప్రస్తుత సినిమాల విషయానికి వస్తే ఈయన డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర అనే సినిమా ద్వారా ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జనవరి 9వ తేదీ విడుదల కానున్న సంగతి తెలిసిందే.

The post Chiranjeevi: షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు నోచుకోని చిరు సినిమా.. ఏంటో తెలుసా? appeared first on Telugudesk.