Madhavi Latha Sensational Comments: సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో రాష్ట్రీయ యువ హిందూ వాహిని మీడియా సమావేశం నిర్వహించింది. ఈ క్రమంలో రాష్ట్రీయ హిందూ వాహిని జాతీయ అధ్యక్షుడు అనురాగ్ మాట్లాడుతూ మహిళలు & పిల్లల భద్రతను పెంపొందించడం కోసం రాష్ట్రీయ యువ హిందూ వాహిని కృషి చేస్తుందని అన్నారు. నిరుపేద బాలికలకు రక్షణ, సాధికారత వంటి ప్రాధాన్య రంగాలపై దృష్టి సారిస్తున్నామని, మా NGO సనాతన ధర్మాన్ని ప్రోత్సహిస్తుంది, గో సంరక్షణకు హామీ ఇస్తుందన్నారు. పేద బాలికల వివాహాలకు మద్దతు ఇస్తుందని, తెలంగాణ ప్రభుత్వంతో మా సహకారం సమాజ అభివృద్ధికి అందుకు నిదర్శనం అని, తెలంగాణ వికాసం కోసం పాటు పడతామని అన్నారు.

The GOAT Trailer : విజయ్ ‘గోట్’ ట్రైలర్ వచ్చేసింది.. చూశారా?

నాన్ పొలిటికల్ పార్టీగా ముందుకు వస్తున్నామని, మా మిషన్‌ను ముందుకు తీసుకెళ్లడానికి కట్టుబడి ఉన్నామని అన్నారు. గౌరవనీయ కేంద్ర రక్షణ మంత్రి మార్గదర్శకత్వంలో సనాతన ధర్మం కోసం పోరాడుతున్నమని అన్నారు. ఇక సినీ నటి & రాష్ట్రీయ యువ హిందు వాహిని అధికార ప్రతినిధి మాధవీలత మాట్లాడుతూ మహిళలు, చిన్నారులు ఎలాంటి సమస్యలో ఉన్నా మేము ముందుంటామని అన్నారు. విద్య, వైద్య, భద్రత పరంగా మా రాష్ట్రీయ యువ హిందూ వాహిని పోరాడుతుందని, చాలా సమస్యల వల్ల మహిళలు ముందుకు రావడం లేదని అన్నారు. హిందూ వాహిని అన్ని మతాల వారికి అండగా కృషి చేస్తుందని, చిన్నారులు- బాలికలు కామాంధుల చేతిలో నలిగిపోతున్నారని అన్నారు. ఎన్నో ఘటనలలో POCSO కేసులు నమోదు అవుతున్నాయి. చిన్నారులను హింసిస్తున్న వారి పక్షాన ఓ మహిళ మంత్రి వెళ్లి ఓ కార్యక్రమాన్ని ప్రారంభించడం సిగ్గుచేటని అన్నారు. కొన్ని కేసుల్లో దొంగలు, పోలీసులు ఒకటవుతున్నారు అని ఆరోపించిన ఆమె POCSO కేసుల్లో నిందితులు బెయిల్ పై తిరుగుతున్నారని అన్నారు.