ఎమ్మెల్యే కేటీఆర్‌: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. సచివాలయంలో తెలంగాణ తల్లి కోసం కేటాయించిన స్థలంలో రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడాన్ని ఆయన ఖండించారు. తాము అధికారంలోకి రాగానే రాజివ్ గాంధీ విగ్రహాన్ని తొలిగించి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్నారు.

గతంలో మేము ఉన్నపుడు సెక్రటేరియట్ ముందు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని నిర్ణయించిన స్థలంలో పెడుతున్న రాజీవ్ గాంధీ విగ్రహాన్ని బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాగానే తొలగించి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాం అని ఆయన అన్నారు. గతంలో మేము అధికారంలో ఉన్న రాజీవ్ గాంధీ ఎయిర్‌పోర్టు పేరు మార్చలేదని.. కానీ వచ్చే ఎన్నికల్లో తాము అధికారంలోకి వచ్చి రాజీవ్ గాంధీ పేరు తీసేసి పీవీ నరసింహారావు లేదా ప్రొఫెసర్ జయశంకర్ అని పేరు మారుస్తాం అని అన్నారు. ప్రస్తుతం కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలకు దారి తీశాయి.

The post MLA KTR: రాజీవ్ గాంధీ ఎయిర్‌పోర్టు పేరు మారుస్తాం: కేటీఆర్ appeared first on Rtvlive.com.