హైడ్రా: రోజురోజుకూ అక్రమార్కులపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది. రంగారెడ్డి జిల్లా గండిపేట, ఖానాపూర్‌లో అక్రమ నిర్మాణాలు నేలమట్టం చేశారు హైడ్రా అధికారులు. గండిపేట చెరువు స్థలంలో నిర్మించిన వ్యాపార సముదాయాల కూల్చివేస్తున్నారు. ఉదయం నుంచి కూల్చివేతలు మొదలు పెట్టారు. అధికారులకు, యజమానులకు మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది. భారీ పోలీస్ బందోబస్తు మధ్య కూల్చివేతలు కొనసాగుతున్నాయి. అడ్డుగా వచ్చిన వారిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

The post HYDRA: అక్రమకట్టడలపై హైడ్రా ఉక్కుపాదం appeared first on Rtvlive.com.