ఈ వార్తను అనువదించండి:

ఫోన్ ట్యాపింగ్ కేసు: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఏ2గా ఉన్న మాజీ అడిషినల్ ఎస్పీ భుజంగరావుకు నాంపల్లి కోర్టు మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేసింది. అనారోగ్యం కారణంగా తనకు బెయిల్ ఇవ్వాలంటూ భుజంగరావు దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన ధర్మాసనం..  15 రోజుల పాటు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు ఇచ్చింది. కోర్టు ఆదేశాలు లేకుండా హైదరాబాద్ విడిచి వెళ్లోద్దని ఆదేశాలు ఇచ్చింది. కాగా తెలంగాణలో సంచలనంగా మారిన ఫోన్ టాపింగ్ కేసులో మార్చి 23న భుజంగరావును పోలీసులు అరెస్ట్ చేశారు. పలుమార్లు బెయిల్ కోసం అభ్యర్థించగా.. కోర్టు ఆ పిటిషన్లను తోసిపుచ్చింది. తాజాగా భుజంగరావుకు గుండె సమస్య కారణంగా బెయిల్మంజూరు చేసింది.

పూర్తిగా చదవండి..