ఎమ్మెల్యే కేటీఆర్‌: బీఆర్ఎస్ మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. సచివాలయం ముందు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టె స్థలంలో కాంగ్రెస్ పెడుతున్న రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తాము అధికారంలోకి రాగానే తొలగిస్తాం అని అన్నారు. అదే స్థలంలో తెలంగాణ తల్లి విగ్రహం పెడతాం అని తేల్చి చెప్పారు. అలాగే శంషాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ పెరు కూడా మారుస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ రాజీవ్, ఇందిరా గాంధీల పేర్ల పిచ్చిని అంతమొందిస్తాం అని హెచ్చరించారు. రేవంత్ కు రాజీవగాంధీ అంటే అంత ఇష్టముంటే రేవంత్ ఇంట్లో రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టుకోవాలని సూచించారు. రాహుల్ గాంధీని ప్రసన్నం చేసుకోవడానికే సచివాలయం ముందు రేవంత్ రాజీవ్ విగ్రహం పెడుతున్నారని చురకలు అంటించారు.

వందలాదిమంది తెలంగాణ ప్రజల ప్రాణాలు తీసిన కాంగ్రెస్ పార్టీ మరోసారి తెలంగాణ ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని పక్కకు పెట్టి రాహుల్ గాంధీ విగ్రహాన్ని పెడుతుందని మండిపడ్డారు. మన పోరాటమే అస్తిత్వ పోరాటం ఆత్మ గౌరవ పోరాటం అని అన్నారు. మళ్లీ నాలుగేళ్లలో తెలంగాణలో కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇప్పుడు పెడుతున్న రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని సకల మర్యాదలతో తొలగించి.. కాంగ్రెస్ పార్టీ కోరుకున్నచోటికి పంపిస్తాం అని అన్నారు.

ఈరోజు తెలంగాణ తల్లికి కాంగ్రెస్ పార్టీ చేసిన అవమానం మరిచిపోదు తెలంగాణ అని అన్నారు. ఇతర రాష్ట్రాల్లో ఉన్నట్టుగానే ప్రాంతీయంగా తెలంగాణ మహనీయుడి పేరును అంతర్జాతీయ విమానాశ్రయానికి పెడతాం అని చెప్పారు. ఈరోజు తెలంగాణ ఆత్మగౌరవానికి, అమరవీరుల త్యాగాలకు అవమానపరిచేలో రాజీవ్ గాంధీ విగ్రహం పెడుతున్న కాంగ్రెస్ పార్టీ తీరు మార్చుకోవాలని సూచన చేశారు. ఇప్పటికే రాజీవ్ గాంధీ ఇందిరా గాంధీ విగ్రహాలు సరిపోయినన్ని ఉన్నాయని చెప్పారు. ఢిల్లీకి గులాములుగా ఉన్న మీకు తెలంగాణ పౌరుషం కలిగిన బిడ్డగా చెబుతున్న వాటిని మార్చే దిశగా ఆలోచన చేస్తామన్నారు.

The post MLA KTR: సీఎం రేవంత్‌కు కేటీఆర్ హెచ్చరిక appeared first on Rtvlive.com.