రేవంత్ – హరీష్ రావు తెలంగాణలో ప్రస్తుతం రుణమాఫీ అమలుపై కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఓ వైపు మేము అందరికీ రుణమాఫీ చేస్తామని.. సాంకేతిక కారణల వల్ల కొంతమందికి మాఫీ జరగలేదని రేవంత్ సర్కార్ చెబుతోంది. మరోవైపు రుణమాఫీ డొల్లా అని.. చాలా మంది రైతులకు మాఫీ జరగలేదని బీఆర్ఎస్ విమర్శలు చేస్తోంది. ఇలా రుణమాఫీపై అధికార, విపక్ష పార్టీలు విభిన్న అభిప్రాయలు చెబుతున్నాయి. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ.. తాము అధికారంలోకి వస్తే రూ.2 లక్షల వరకు లోన్ తీసుకున్న రైతుందరికీ మాఫీ చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే.