Adah Sharma: ఆదాశర్మ పరిచయం అవసరం లేని పేరు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నితిన్ హీరోగా నటించిన హార్ట్ ఎటాక్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు హీరోయిన్గా పరిచయమయ్యారు మొదటి సినిమాతోనే పెద్ద ఎత్తున గ్లామర్ షో చేస్తూ అందరిని ఆకట్టుకున్న ఈమెకు అనంతరం అవకాశాలు వచ్చాయి కానీ ఆ సినిమాలేవి పెద్దగా సక్సెస్ కాకపోవడంతో సినిమా అవకాశాలు క్రమక్రమంగా తగ్గాయి.

ఇలా సినిమా అవకాశాలు తగ్గిపోవడంతో ఆదాశర్మ సెకండ్ హీరోయిన్ గా కూడా నటించారు అయితే ఇలా సెకండ్ హీరోయిన్ గా నటించడం ఆమె కెరియర్ పై పూర్తిగా దెబ్బ కొట్టిందని చెప్పాలి. ఇలా హీరోయిన్ గా కొనసాగుతున్న ఈమెకు అవకాశాలు పూర్తిగా తగ్గిపోవడంతో ఇండస్ట్రీకి దూరమయ్యారు అయితే ఇటీవల ది కేరళ స్టోరీ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సెస్ అందుకున్నారు.

ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో మంచి సక్సెస్ కావడంతో ఈమెకు వరుసగా సినిమా అవకాశాలు వస్తున్నాయి. ఇలా వరుస సినిమాలలో నటిస్తూనే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే ఆదాశర్మ సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోని షేర్ చేశారు. అయితే ఇందులో ఈమె బేబీ బంప్ తో కనిపించడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు అదేంటి పెళ్లి కాకుండానే ఈమె తల్లి కాబోతుందా అంటూ షాక్ అవుతున్నారు.

ఇటీవల కాలంలో హీరోయిన్స్ అందరూ కూడా పిల్లలు పుట్టిన తర్వాత పెళ్లిళ్లు చేసుకుంటున్నారు లేదా గర్భం దాల్చిన తర్వాత పెళ్లి చేసుకుంటున్నారు ఈమె కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతున్నారా అంటూ సందేహాలు వ్యక్తం చేశారు కానీ ఈమె నటిస్తున్న సినిమాలో భాగంగా ఒక పాత్ర అని తెలియడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఇక ఈ వీడియోని షేర్ చేస్తూ ఈ సినిమా పేరు ఏంటో కనుక్కోండి ఈ సినిమాలో పరిస్థితులు ఎన్నో ఒత్తిడికి గురి చేస్తూ ఉంటాయి అయినప్పటికీ నేను పూర్తిగా పరధ్యానం కాకుండా నా మనసును చెదరగొట్టేలా ఇలా క్రేజీగా బిహేవ్ చేస్తాను అంటూ ఈమె క్యాప్షన్ జోడించారు ప్రస్తుతం ఈ ఫోటోలు వీడియోలు వైరల్ అవుతున్నాయి.

https://www.instagram.com/reel/C-zsTe1NNzu/?utm_source=ig_embed&ig_rid=cc8f7133-d33a-4798-95ee-2e12422a4a4c