Tollywood Directors: సినిమా ఇండస్ట్రీలోకి ఎంతోమంది కొత్త టాలెంట్ కలిగిన వారు వస్తూ ఉంటారు ఇలా కొత్తవారు రావడంతో పాతవాళ్లు కనుమరుగవుతూ ఉంటారు. ఇలా కొత్తనీరు చేరినప్పుడు పాత నీరు బయటకు ఎలా వెళ్లాలో ఇండస్ట్రీలో కూడా కొత్తవాళ్లు వచ్చినప్పుడు పాత సెలబ్రిటీలు కనుమరుగవడం సర్వసాధారణం అయితే ఒకప్పుడు ఇండస్ట్రీకి మూల స్తంభాల ఉన్నటువంటి కొంతమంది డైరెక్టర్లు ఇటీవల కాలంలో ప్రేక్షకులను మెప్పించలేకపోతున్నారు.

ముఖ్యంగా ఐదుగురు స్టార్ డైరెక్టర్లు ఇటీవల కాలంలో తమ సినిమాల ద్వారా ప్రేక్షకులను పూర్తిగా నిరాశ పరుస్తున్నారు. మరి ఇండస్ట్రీలో స్టార్స్ గా కొనసాగిన ఏ డైరెక్టర్లు ప్రేక్షకులను మెప్పించలేకపోయారనే విషయానికి వస్తే అలాంటి వారిలో ముందు వరుసలో ఉన్నారు డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్. ఎంతోమంది చేత గురూజీ అంటూ పిలిపించుకొని తన మాటలతో అందరిని మాయ చేసే త్రివిక్రమ్ ఇటీవల కాలంలో అనుకున్న స్థాయిలో సినిమాలను ప్రేక్షకులకు ఇవ్వలేకపోతున్నారు.

ఇటీవల మహేష్ బాబుతో చేసిన గుంటూరు కారం పూర్తిగా ప్రేక్షకులను నిరాశపరిచింది. ఇక ఈయన తర్వాత బోయపాటి కూడా అదే స్థాయిలో ప్రేక్షకులను నిరాశ పరుస్తున్నారు రామ్ హీరోగా నటించిన స్కంద సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు ఈ సినిమా చూసిన తర్వాత బాలయ్య అఖండ సినిమాని చేసింది బోయపాటేనా అనే సందేహం రాకమానదు.

నిరాశలో ప్రేక్షకులు..
ఇక కొరటాల శివ అపజయమెరుగని దర్శకుడిగా ఈయనకు పేరు ఉంది. వరుస హిట్ సినిమాలతో స్టార్ డైరెక్టర్గా కొనసాగిన కొరటాల ఆచార్య వంటి ఫ్లాప్ మూవీని ఎదుర్కొన్నారు. ఇప్పుడు ఈయన ఆశలన్నీ కూడా దేవరపైనే ఉన్నాయి. దేవర హిట్ అయితే కొరటాల కెరియర్ కు డోకా ఉండదని చెప్పాలి తేడా కొడితే ఇండస్ట్రీకి దూరం కావాల్సిందే. ఇక పూరి జగన్నాథ్ హరీష్ శంకర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు వీరిద్దరికీ హిట్ సినిమాలు వచ్చి చాలా కాలం అవుతుందనే చెప్పాలి ఎంతో టాలెంట్ కలిగిన ఈ డైరెక్టర్లు ఇటీవల కాలంలో ప్రేక్షకులను మెప్పించడంలో పూర్తిగా విఫలమవుతున్నారు.