Indraja: సినిమా ఇండస్ట్రీ అనేది ఒక రంగుల ప్రపంచం. ఇక్కడ ఎప్పుడు ఎవరి లైఫ్ ఎలా మారుతుందో ఎవరికి తెలియదు. అంతేకాకుండా ఇండస్ట్రీలో పని చేసే సెలబ్రెటీలు పెద్ద ఎత్తున వార్తలలో కూడా నిలుస్తూ ఉంటారు. ఒక హీరో హీరోయిన్ కలిసి పలు సందర్భాలలో బయట కనిపించిన లేకపోతే రెండు మూడు సినిమాలలో వరుసగా నటించిన వారి మధ్య ఏదో ఉంది అంటూ వార్తలను అల్లేస్తారు.

ఇలాంటి వార్తల ద్వారా ఎంతో మంది సెలబ్రిటీలు వివాదాలలో కూడా చిక్కుకున్నారు అయితే కొంతమంది ప్రేమలో పడి పెళ్లిళ్లు చేసుకున్నారు. అలాగే మరికొందరు మంచి స్నేహితులుగా ఉండిపోయారు. అయితే ఇలాంటి వార్తలలో నిలిచిన వారిలో నటుడు రాజేంద్రప్రసాద్ కూడా ఒకరు.

ఎంతోమంది హీరోయిన్ల విషయంలో రాజేంద్రప్రసాద్ వార్తలలో నిలిచారు. ఇలాంటి వారిలో నటి ఇంద్రజ కూడా ఒకరు. నటి ఇంద్రజ అప్పట్లో తెలుగు తమిళ సినిమాలలో నటిస్తూ స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఈ క్రమంలోనే ఈమె నటుడు రాజేంద్రప్రసాద్ పై మనసు పారేసుకున్నారని ఆయన ప్రేమలో పడి స్టార్ హీరోల సినిమాలను కూడా వదులుకున్నారని తెలుస్తోంది.

హీరోయిన్ గా మాత్రమే చూశారు..
ఇలా రాజేంద్రప్రసాద్ ప్రేమలో ఉన్న ఈమె ఇలా సినిమాలను మిస్ చేసుకుని ఎంతో కోల్పోయారని, రాజేంద్రప్రసాద్ తో ప్రేమ కారణంగా వరుసగా ఆయనతో సినిమాలు చేస్తూ ఉన్నారని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే వీరిద్దరి మధ్య ఏ విధమైనటువంటి రిలేషన్ లేదని కేవలం స్నేహబంధం మాత్రమే కొనసాగిందని తెలుస్తోంది. బయట వీటి గురించి ఇలాంటి వార్తలు వచ్చిన రాజేంద్రప్రసాద్ ఇంద్రజ హీరో హీరోయిన్లుగా మాత్రమే నటించారని తెలుస్తుంది.