Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పెద్ద ఎత్తున వార్తలలో నిలుస్తున్నారు. ఇటీవల ఈయన ఓ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో భాగంగా నేను ఎక్కడికైనా వెళ్లాలంటే వారు నాకు నచ్చాలని, నచ్చితేనే వెళ్తాను అంటూ కామెంట్లు చేశారు. దీంతో ఈయన పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించే ఇలా తనకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారంటూ ఈ వీడియోని వైరల్ చేస్తున్నారు.

ఏపీ ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ కి కాకుండా తన స్నేహితుడికి మద్దతు తెలపడానికి వెళ్లిన అల్లు అర్జున్ పై మెగా ఫ్యాన్స్ ఎంతగానో ట్రోల్ చేశారు. అయితే వారందరికీ కూడా దీటుగా బన్నీ సమాధానం చెప్పారని తెలుస్తుంది. ఇదిలా ఉండగా నేడు చిరంజీవి పుట్టినరోజు కావడంతో పెద్ద ఎత్తున సెలబ్రిటీలు అభిమానులు ఆయనకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ఈ క్రమంలోనే అల్లు అర్జున్ సైతం సోషల్ మీడియా వేదికగా చిరంజీవికి శుభాకాంక్షలు చెబుతూ మెనీ హ్యాపీ రిటర్న్స్ అఫ్ ది డే అవర్ చిరంజీవి గారు అంటూ సింపుల్ గా శుభాకాంక్షలు చెప్పారు. దీంతో ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తనకు ఎంతో లైఫ్ ఇచ్చిన చిరంజీవి గారు పుట్టినరోజు జరుపుకుంటున్న నేపథ్యంలో ఆయనకు ఒక్క ముక్కలో శుభాకాంక్షలు తెలుపుతూ పోస్ట్ చేయడంతో మెగా ఫాన్స్ ఫైర్ అవుతున్నారు.

ఫార్మలిటీకి చెప్పారా..
ఏదో అల్లు అర్జున్ చెప్పాలన్న కారణంతో చిరంజీవికి శుభాకాంక్షలు చెప్పారే తప్ప మనస్పూర్తిగా చెప్పలేదంటూ పలువురు విమర్శలు కురిపిస్తున్నారు. గత కొద్ది రోజులుగా మెగా అల్లు కుటుంబాల మధ్య వివాదాలు నడుస్తూనే ఉన్నాయి. అయితే నేడు అల్లు అర్జున్ శుభాకాంక్షలు చెప్పడంతో వివాదాలు ముగిసిపోయాయని పలువురు భావించిన బన్ని చేసిన పోస్ట్ చూస్తుంటే మాత్రం కేవలం ఫార్మలిటీకి మాత్రమే చెప్పారని తెలుస్తోంది.