Kiran Abbavaram: టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం కొత్త జీవితంలోకి అడుగు పెట్టారు. ఈయన సహ నటి రహస్య గోరఖ్ ను వివాహం చేసుకున్నారు. వీరి వివాహం కర్ణాటకలోని కూర్గ్ వద్ద కేవలం అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో మాత్రమే జరిగింది. తాజగా వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

కిరణ్ అబ్బవరం రహస్య ఇద్దరు కూడా రాజా వారు రాణి గారు అనే సినిమా ద్వారా మొదటిసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు హీరో హీరోయిన్లుగా వచ్చారు మొదటి సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న వీరిద్దరూ ఈ సినిమా సమయంలోనే ప్రేమలో పడ్డారు. ఇలా ప్రేమలో ఉన్నటువంటి వీరిద్దరూ వారి ప్రేమ విషయాన్ని ఎక్కడ బయట పెట్టలేదు.

పలు సందర్భాలలో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ వార్తలు బయటకు వచ్చాయి కానీ ఈ వార్తలపై వీరిద్దరు ఎక్కడ స్పందించిన దాఖలాలు లేవు. అయితే ఓ సినిమా ప్రమోషన్లలో భాగంగా కిరణ్ అబ్బవరం పొరపాటున నోరు జారడంతో వీరి మధ్య ఉన్న రిలేషన్ బయటపడింది. ఇలా తమ రిలేషన్ బయటపెట్టిన కొద్ది రోజులకే నిశ్చితార్థం కూడా ప్రకటించారు.

కూర్గ్ లో వివాహం..
ఇలా ఈ ఏడాది మొదట్లో నిశ్చితార్థం జరుపుకున్న ఈ జంట ఆగస్టు 22వ తేదీ కుటుంబ సభ్యులు సన్నిహితుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. తాజాగా ఈ పెళ్లికి సంబంధించిన కొన్ని వీడియోలు ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇక ఈ ఫోటోలు చూసిన అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.