Raviteja: మాస్ మహారాజ రవితేజ ఇటీవల షూటింగ్ సమయంలో ప్రమాదానికి గురయ్యారని సంగతి మనకు తెలిసిందే. అయితే ఈయన యశోద హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటూ ఉన్నటువంటి ఒక ఫోటో బయటకు విడుదల అయింది దీంతో అభిమానులు ఎంతో కంగారు వ్యక్తం చేస్తున్నారు. బెడ్ పై రవితేజ స్పృహ లేకుండా ఉండడమే కాకుండా చేతికి మొత్తం పెద్ద ఎత్తున రక్తం కారుతూ కనిపించింది.

ఇలా ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో రవితేజ అభిమానులు ఒక్కసారిగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రవితేజ గారికి అసలు ఏమైంది ఇలా బ్లడ్ మొత్తం కారిపోతుంది అంటూ ఆయన ప్రమాదంపై ఆరా తీస్తున్నారు అయి ఈయన ప్రమాదం గురించి తాజా అప్డేట్ వెల్లడించారు.

రవితేజ ప్రమాదానికి గురైన సంగతి వాస్తవమేనని తెలిపారు. ఈయన ప్రస్తుతం తన 75వ సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ఇలా సినిమా షూటింగ్ సమయంలోనే ప్రమాదం జరిగింది. ఒక యాక్షన్ సన్నివేశాలను షూట్ చేస్తున్న సమయంలో ఆయన కుడి చేతికి గాయమైంది కండరం చిట్టి నా కూడా ఆయన అలాగే షూటింగ్లో పాల్గొన్నారు.

ఆరు వారాలు విశ్రాంతి..
ఇలా గాయం తగిలిన షూటింగ్లో పాల్గొనడంతో రక్తస్రావం అధికంగా అయింది వెంటనే చిత్ర బృందం తనని యశోద హాస్పిటల్ కి తీసుకెళ్లగా వైద్యులు తనకు సర్జరీ నిర్వహించారని వెల్లడించారు. ఇక సర్జరీ కూడా సక్సెస్ కావడంతో ఈయన ప్రస్తుతం హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారని అయితే ఆరు వారాలపాటు విశ్రాంతి తప్పనిసరిగా అవసరమని వైద్యులు వెల్లడించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఇంటికి కూడా వెళ్లారని తెలియడంతో అభిమానులు కాస్త ఊపిరి పిలుచుకున్నారు.