Pawan Kalyan: సినీ నటుడు పవన్ కళ్యాణ్ హీరోగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇలా హీరోగా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న ఈయన ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకున్న సంగతి తెలిసిందే. ఇలా రాజకీయాల పరంగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న పవన్ ప్రస్తుతం రాజకీయ పనులలో బిజీగా గడుపుతున్నారు.

ఇక పవన్ కళ్యాణ్ ఎన్నికలలో పోటీ చేయడానికి కంటే ముందుగానే కొన్ని సినిమాలకు కమిట్ అయ్యారు. ఈ సినిమాలన్నీ కూడా సగ భాగం షూటింగ్ పూర్తి అయ్యాయి. మిగిలిన సగభాగం అలాగే ఉండిపోవడం అనంతరం పవన్ కళ్యాణ్ రాజకీయాలలో బిజీగా మారడం డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకోవడం జరిగింది దీంతో ఆ సినిమాల పరిస్థితి ఏంటి అనే ప్రశ్న ప్రతి ఒక్క అభిమాని లోను ఉంది

ఇటీవల ఈయన కమిట్ అయిన సినిమాల దర్శకులు నిర్మాతలు ఆయనని కలిసి సినిమాల గురించి చర్చలు జరిపినట్టు తెలుస్తుంది. అయితే త్వరలోనే పవన్ కళ్యాణ్ తిరిగి ఆ సినిమా షూటింగ్స్ పూర్తి చేయబోతున్నారని సమాచారం. ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ ఏ కార్యక్రమానికి వెళ్లిన పెద్ద ఎత్తున అభిమానులు సినిమాల గురించి అప్డేట్ ఇవ్వాలని కేకలు వేస్తూ ఉన్నారు. ఈ తరుణంలోనే ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఈయన అభిమానులకు తనదైన స్టైల్ లో వార్నింగ్ ఇచ్చారు.

రాజకీయాలపై ఫోకస్..
సినిమాల గురించి అయితే థియేటర్లలోనే చూడండి. నేను సినిమాలను రాజకీయాలను ప్రత్యేకంగా చూస్తానని తెలిపారు. ప్రస్తుతం నేను సినిమాలలో నటిస్తూ ఉంటే కనుక కచ్చితంగా సినిమాల గురించే మాట్లాడేవాడిని. ప్రస్తుతం నా దృష్టి మొత్తం రాజకీయాలపైనే ఉందని, గ్రామహితం, అన్నం పెట్టే రైతు బాగుంటేనే అందరం బాగుంటామని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రసంగాలలో సినిమాల గురించి అరవద్దు అంటూ అభిమానులకు వార్నింగ్ ఇచ్చారు.