Mahesh Babu: సాధారణంగా మనం పైకి ఎంతో గంభీరంగా కనిపించినా ఏదో ఒక విషయంలో చిన్న భయం అనేది మనలో ఉంటుంది కొంతమందికి కొన్ని వస్తువులను చూస్తే భయం కలుగుతుంది. మరి కొన్ని వస్తువులకు కొన్ని జంతువులను చూసిన భయం కలుగుతుంది అలాగే మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సినిమాలలో ఎన్నో యాక్షన్స్ సన్ని వేషాలు చేసిన నిజజీవితంలో మాత్రం ఈయన ఓ విషయానికి చాలా భయపడతారని తెలుస్తుంది.

సాహసవంతుడిగా ధైర్యవంతుడిగా ఎన్నో యాక్షన్స్ సన్ని వేషాలలో నటించి చూపించే మహేష్ బాబుకు నీళ్లు అంటే చాలా భయం అని తెలుస్తుంది. ఈయనకు ఎత్తైన జలపాతాలు చూసిన, భారీగా పారుతున్న నీటిని చూసిన కాస్త భయపడతారట అందుకే దర్శక నిర్మాతలకు ఎక్కువగా ఇలాంటి ప్రాంతాలలో షూటింగ్స్ వద్దని ముందుగానే రిక్వెస్ట్ చేసుకుంటారని తెలుస్తోంది.

ఇక ఈయన వెకేషన్ ఎంతో అందమైన ప్రదేశాలకు వెళుతుంటారు కానీ ఎప్పుడూ కూడా వాటర్ ఫాల్స్ వంటి ప్రాంతాలకు మహేష్ బాబు వెళ్లరని తెలుస్తోంది ఇలా మహేష్ బాబుకి వాటర్ అంటే కాస్త భయం అనే విషయం తెలిసిన అభిమానులు ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. ఎన్నో అడ్వెంచర్స్ సన్నివేశాలు, సినిమాలలో నటించే మహేష్ బాబుకి నీళ్ళని చూస్తే భయమా అని అభిమానుల షాక్ అవుతున్నారు.

నీళ్లంటే భయమా..
ఇక మహేష్ బాబు కెరియర్ విషయానికి వస్తే ప్రస్తుతం ఈయన రాజమౌళి డైరెక్షన్లో ఓ సినిమాకు కమిట్ అయిన సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమా ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ పనులు కూడా ప్రారంభం కాబోతున్నాయి.