సీఎం రేవంత్: తెలంగాణలో రూ.2 లక్షలపైన రుణాలు ఉన్న రైతులకు దశలవారీగా రుణమాఫీ అమలు చేస్తామని రేవంత్ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, రుణమాఫీ కాక కొందరు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో రూ.2లక్షల లోపు రుణమాఫీ కానివాళ్లకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. “రైతు భరోసా పంట రుణమాఫీ” పేరుతో యాప్ అందుబాటులోకి తెచ్చింది.

Also Read: సంచలనంగా కోల్‌కతా డాక్టర్‌ కేసు.. కీలకంగా మారిన సీసీ ఫుటేజ్‌.. ఆ 29 నిమిషాల్లోనే…

అర్హులై ఉండి రేషన్‌కార్డు లేక, ఇతర కారణాల వల్ల రుణమాఫీ కాని రైతుల వివరాలు యాప్‌లో నమోదు చేసేందుకు అవకాశం కల్పించనుంది. రేపటి నుంచి ప్రయోగాత్మకంగా కొందరి రైతుల వివరాల నమోదు చేయనుంది. వ్యవసాయ అధికారులు.. ఫిర్యాదు చేసిన రైతుల ఇళ్లకు వెళ్లి బ్యాంకు అకౌంట్, ఆధార్‌కార్డులను తనిఖీ చేస్తారు. ఇష్ట పూర్వకంగానే వివరాలు ఇచ్చినట్టు కుటుంబ యజమానితో ధ్రువీకరణపత్రం తీసుకుంటారు.

The post CM Revanth: రుణమాఫీ కానివాళ్లకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్..! appeared first on Rtvlive.com.