రావు రమేష్ కథానాయకుడిగా నటించిన సినిమా ‘మారుతీ నగర్ సుబ్రమణ్యం’. లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహించారు. క్రియేటివ్ జీనియస్ సుకుమార్ సతీమణి తబితా సుకుమార్ సమర్పణలో పీబీఆర్ సినిమాస్, లోకమాత్రే సినిమాటిక్స్ సంస్థలపై రూపొందిన చిత్రమిది. బుజ్జి రాయుడు పెంట్యాల, మోహన్ కార్య నిర్మాతలుగా వ్యవహరించారు. రావు రమేష్ సరసన అలనాటి హీరోయిన్ ఇంద్రజ నటించింది.  అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి మరో జంటగా, హర్షవర్ధన్ కీలక పాత్రలో నటించి మెప్పించారు.

Also Read: Mahesh Babu: సింహంలా గర్జించిన మహేశ్ బాబు ‘ముఫాసా’ ట్రైలర్ రిలీజ్..

సుకుమార్ సతీమణి తబిత తొలిసారిగా ‘మారుతి నగర్ సుబ్రమణ్యం’ సమర్పకురాలిగా వ్యవహరించింది. కంటెంట్ నచ్చడంతో తెలంగాణ, ఏపీలో ఈ చిత్రాన్ని అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌కు చెందిన మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్ఎల్‌పి విడుదల చేసింది. విడుదలకు ఒక ఒక రోజు ముందుగా ప్రిమియార్స్ ప్రదర్శించగా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఆగస్టు 23న రిలీజైన ఈ సినిమా మౌత్ టాక్ తో దూసుకెళుతుంది. విడుదలైన మొదటి 3 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 2.34 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టిందని అధికారక పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. కమిటీ కుర్రాళ్లు, ఆయ్, మారుతీనగర్ సుబ్రమణ్యం సినిమాల సూపర్ హిట్స్ తో  ప్రేక్షకులు టాలీవుడ్ కి  చిన్న పాటి వార్నింగ్ అందిచారు. తమకు కావాల్సింది స్టార్ హీరోల అనవసరపు హంగులు, ఆర్భాటాలు, అక్కర్లేని ఐటమ్ సాంగ్స్ కాదని, చక్కటి కథాబలం, వైవిధ్య భరితమైన కథ, సరదాగా వినసొంపుగా ఉంటే డైలాగ్స్, కుటుంబంతో చూసే సినిమాలు కావాలని ఈ చిన్న సినిమాల హిట్స్ తో మరోసారి నిరూపించారు. ఇకనైనా దర్శకులు తీరు మారితే నాలుగు మంచి సినిమాలు వస్తాయ్.