Tejaswini: బిగ్ బాస్ సీజన్ 8 కార్యక్రమం త్వరలోనే ప్రారంభం కాబోతున్న తరుణంలో ఇప్పటికే ఈ కార్యక్రమంలో పాల్గొనబోయే కంటెస్టెంట్లకు సంబంధించిన లిస్టు మొత్తం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ లిస్టులో తేజస్విని గౌడ మొదటి నుంచి వినిపిస్తున్న పేరు. గత సీజన్లో రన్నర్ గా నిలిచిన అమర్ భార్యగా తేజస్విని అందరికీ పరిచయమే.

ఇక తేజస్విని ఈ కార్యక్రమంలో కన్ఫర్మ్ అయిందంటూ కూడా వార్తలు వచ్చాయి కానీ ఈ కార్యక్రమం మరికొద్ది రోజులలో ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఈమె ఈ కార్యక్రమంలో పాల్గొనలేదు అంటూ వార్తలు వినపడుతున్నాయి. ఇలా చివరి నిమిషంలో ఈమె బిగ్ బాస్ నుంచి తప్పుకున్నారని అందుకు కారణం ఇంటర్వ్యూలో రెమ్యూనరేషన్ విషయంలో గొడవ జరిగిందని తెలుస్తుంది.

తేజస్విని బిగ్ బాస్ కార్యక్రమానికి ఎంపిక అయ్యారు అయితే ఇంటర్వ్యూలు కూడా పూర్తి అయ్యాయి కానీ ఈమె అధిక మొత్తంలో రెమ్యూనరేషన్ డిమాండ్ చేశారని తెలుస్తోంది. ఇలా అధిక మొత్తంలో రెమ్యూనరేషన్ డిమాండ్ చేసిన తరుణంలో నిర్వాహకులు ఈమెకు అంత మొత్తంలో చెల్లించుకోలేకపోతున్నారని అందుకే ఈమె ఈ కార్యక్రమానికి ఎంపిక కాలేదని తెలుస్తోంది.

మౌనం వహిస్తున్న తేజస్విని..
ఇలా తేజస్విని గౌడ బిగ్ బాస్ కార్యక్రమంలోకి అడుగుపెట్టలేదని కొంతమంది యూట్యూబర్స్ అలాగే ఇందులో పాల్గొనబోతున్నారని మరికొందరు తెలియజేస్తున్నారు. అయితే ఈమె విషయంలో మాత్రం అభిమానులకు పూర్తిగా కన్ఫ్యూజన్ నెలకొంది. ఈ కన్ఫ్యూజన్ విడాలి అంటే ఆదివారం వరకు మనం ఎదురు చూడాల్సిందే. ఒకవేళ ఈమె వెళ్లకపోయి ఉంటే ఇతర కంటెస్టెంట్ల మాదిరిగా తాను వెళ్ళట్లేదని క్లారిటీ ఇచ్చేవారు కదా మౌనంగా ఉన్నారంటే ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారని అర్థం అంటూ అభిమానులు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.