మహారాష్ట్ర: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ మహారాజ్‌ విగ్రహం కూలడంపై రాజకీయ దుమారం రేపుతోంది. మాల్వాన్‌లో 35 అడుగుల శివాజీ విగ్రహం కూలిపోవడంపై శివ ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఘటనాస్థలిని పరిశీలించిన డబ్తా ఎమ్మెల్యే వైభవ్ నాయక్ కాంట్రాక్టర్‌పై ఫిర్యాదు చేయడంతో బీఎన్ఎస్ సెక్షన్లు 109, 110, 125, 318, 3(5) కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

Also Read: భారీ వర్షాలకు గుజరాత్‌ అతలాకుతలం.. రెడ్ అలర్ట్ జారీ..!

శివాజీ విగ్రహం కూలడంపై సీఎం ఏక్‌నాథ్‌ షిండే స్పందించారు. విగ్రహం కూలడం దురదృష్టకరమన్నారు. ఘటనపై నేవీ అధికారులు విచారణ చేస్తున్నారన్నారు. బలమైన గాలుల కారణంగా విగ్రహం కూలిపోయిందన్నారు. అదే స్థలంలో శివాజీ విగ్రహాన్ని తిరిగి ప్రతిష్ఠిస్తామన్నారు సీఎం ఏక్‌నాథ్‌ షిండే.

The post Maharashtra: కూలిన ఛత్రపతి శివాజీ మహారాజ్‌ విగ్రహం.. సీఎం ఏక్‌నాథ్‌ షిండే సంచలన వ్యాఖ్యలు appeared first on Rtvlive.com.