NTR: సినిమా ఇండస్ట్రీలో హీరో పిల్లలు హీరోలుగా ఎలా ఎంట్రీ ఇస్తారో హీరోయిన్స్ పిల్లలు కూడా అలాగే హీరోలుగాను హీరోయిన్స్ గాను ఇండస్ట్రీలో కొనసాగిన వారు ఉన్నారు. ఇలా ఇప్పటికే ఎంతోమంది హీరోయిన్స్ వారి పిల్లలను హీరోయిన్లుగా ఇండస్ట్రీలోకి పంపిన సంగతి మనకు తెలిసిందే.

ఇకపోతే తల్లితో నటించిన హీరో కూతురుతో కూడా సినిమాలు చేయడం చాలా అరుదుగా జరుగుతుంది. కానీ మన తెలుగు చిత్ర పరిశ్రమలో ఓకే హీరో ఒకవైపు తల్లితోనూ మరోవైపు కూతురితో రొమాన్స్ చేసిన సందర్భాలు ఉన్నాయి. మరి తల్లి కూతుర్లతో రొమాన్స్ చేసిన ఆ టాలీవుడ్ హీరో ఎవరు అనే విషయాన్నికొస్తే ఆయన మరెవరో కాదు నందమూరి తారక రామారావు అని చెప్పాలి.

ఎన్టీఆర్ ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించారు. అయితే ఈయన తల్లితో పాటు కూతురితో కూడా రొమాన్స్ చేస్తూ సినిమాలలో నటించారు. మరి ఈయనతో నటించిన ఆ తల్లి కూతుర్లు ఎవరు అనే విషయానికి వస్తే.. వారు మరెవరో కాదు సీనియర్ హీరోయిన్స్ అమ్మాజీ, జయచిత్ర.

నందమూరి తారకరామారావు..
అమ్మాజీని జయశ్రీ అని కూడా పిలిచేవారు. ఇక ఈమె ఎన్టీఆర్ తో కలిసి 1959 వ సంవత్సరంలో దైవబలం అనే సినిమాలో నటించారు. ఈ సినిమా అప్పట్లో మంచి విజయం అందుకుంది. ఇక అమ్మాజీ కుమార్తె జయచిత్రతో కూడా ఎన్టీఆర్ హీరోగా నటించారు. 1976 వ సంవత్సరంలో బాలీవుడ్ సినిమాకు రీమేక్ సినిమాగా మా దైవం అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ద్వారా జయచిత్ర హీరోయిన్గా ఎన్టీఆర్ సరసన నటిస్తూ ప్రేక్షకుల ముందుకు వచ్చారు ఇలా తల్లి కూతుర్లతో రొమాన్స్ చేసిన ఏకైక హీరో ఎన్టీఆర్ అని చెప్పాలి.