సాంప్రదాయంలో కొన్ని ఆచరించాలి.. కొన్ని విషయాలు తెలుసుకోవాలి.. అన్ని సైంటిఫిక్‌గా చూడకూడదు. అయితే ఈ మధ్య కాలంలో దేవుడన్నా, సాంప్రదాయాలన్న పెద్దగా పట్టించుకోని వాళ్ళు కొందరున్నారు. అలాంటి వాళ్ళకు మనం ఏం చెప్పినా గాని నమ్మరు. కానీ హిందూధర్మంలో మనకి కొన్ని ఆచారాలు సాంప్రదాయాలు ఉన్నటే.. పరిహార శాస్త్రంలో కూడా కొన్ని రెమెడీస్ చేస్తే మనకి కచ్చితంగా ఫలితం ఉంటుందని పండితులు చెబుతున్నారు. అలాంటి వాటిల్లో స్వస్తిక్ ఒకటి. స్వస్తిక్ అంటే ప్రతి ఒక్కరికి తెలిసి ఉంటుంది. దీనిని ఇంటి ముందు ఎంట్రన్స్‌లో పెట్టుకుంటే నరదృష్టి నుంచి విముక్తి కలుగుతుందట. స్వస్తిక్‌ను మెయిన్ ఎంట్రన్స్ దగ్గర ఎలా పెట్టుకోవాలో దీనివల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయో ఈ ఆర్టికల్‌లో కొన్ని విషయాలు తెలుసుకుందాం.
ఇంటి మెయిన్ ఎంట్రెన్స్ ముందు ఓంకారము, స్వస్తిక్, త్రిశూలం అనే ఈ మూడు గుర్తులు ఉంటాయో.. వాళ్ళకి భయంకరమైనటువంటి నరదృష్టి ఉన్నా సరే మొత్తం నశించిపోతుంది. నరగోష, నరపీడ, ఎదుటివాళ్ళు ఏడుపులు ఇవన్నీ కూడా నశించి పోతాయి. ఇంటి మెయిన్ ఎంట్రెన్స్ మీద ఓంకారం, స్వస్తిక్, త్రిశూలం ఈ గుర్తులను చెక్కించి కూడా పెట్టుకోవచ్చు. అలా పెట్టుకోవటం వీలు కానప్పుడు కనీసం గంధంతో అయినా ఈ మూడు గుర్తులను ఏర్పాటు చేసుకోవాలి. అప్పుడు ఎలాంటి దృష్టిదోషం మీ మీద ఎటువంటి ప్రభావాన్ని చూపదని పరిహార శాస్త్రంలో చెప్పడం జరిగిందని పండితులు చెబుతున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు.
[vuukle]