Saripodhaa Sanivaaram Twitter Review : తెలుగు చిత్ర పరిశ్రమలో ఒకే రకమైన పాత్రలకే పరిమితం కాకుండా క్లాస్, మాస్ చిత్రాలతో అలరిస్తున్నాడు నేచరల్ స్టార్ నాని. తాజాగా ‘సరిపోదా శనివారం’ సినిమాతో నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ చిత్రానికి యు/ఎ సర్టిఫికెట్ జారీ అయింది. అంతేకాదు ఈ సినిమా నాని కెరీర్‌లో మరో డిఫరెంట్ మూవీగా నిలవడం ఖాయమని అంటున్నారు. ఈ చిత్రంలో తమిళ సార్ట్ యాక్టర్ సూర్య విలన్ పాత్రలో నటించారు. ఈ సినిమాలో నాని.. సూర్య అనే పాత్ర పోషించారు. తన కోపాన్ని అణచుకునే పాత్రలో అద్భుతంగా ఒదిగిపోయాడని తెలుస్తోంది. వారంలో శనివారమే తన కోపాన్ని బయటపెడతాడు. ఈ క్రమంలో ఏం జరిగిందనేది ఆసక్తికర అంశం. మాస్ ప్రేక్షకులకు ఈ సినిమా ఫుల్ మీల్ అనే చెప్పాలి. కల్కి తర్వాత మంచి మాస్ సినిమా కోసం ఎదురుచూస్తున్న ప్రేక్షకులను నాని ‘సరిపోదా శనివారం’ అలరించడం ఖాయమని అంటున్నారు.

ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ తో ఈ సినిమా పై అంచనాలు భారీగా పెరిగాయి. అంతేకాదు నాని ఢీకొట్టే విలన్ పాత్రలో ఎస్.జే.సూర్య తన పాత్రలో జీవించేశాడని చెబుతున్నారు. ఈ మూవీ నాని కెరీర్ ల్లోనే మరో డిఫరెంట్ మూవీగా నిలవడం ఖాయం అంటున్నారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ముందుకు వచ్చింది. ఇప్పటికే ఓవర్సీస్ లో షోలు పడ్డాయి. అటు తెలుగు రాష్ట్రాల్లోనూ కొన్ని చోట్ల షోస్ పడగా.. ట్విట్టర్ వేదికగా సరిపోదా శనివారం గురించి ఎవరికి తోచిన విధంగా వారు రివ్యూలు ఇస్తున్నారు. అంతేకాకుండా న్యాచురల్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. మాస్ యాక్షన్ కథాంశంతో తెరకెక్కించిన ఈ సినిమా ఎలా ఉందంటూ నెట్టింట్లో చర్చ నడుస్తోంది.

Read Also:Egg For Good Health: గుడ్డు వెరీ గుడ్.. ప్రతిరోజు గుడ్డు తింటే ఇన్ని మార్పులా..

సరిపోదా శనివారం సినిమాలో శనివారం మాత్రమే ఫైట్ చేస్తాడనే కాన్సెప్ట్ కొత్తగా ఉందని… నాని, ఎస్జే సూర్యల నటన అద్భుతమని అంటున్నారు. ఇక యాక్షన్ సీక్వెన్స్ ఫీస్ట్ లా ఉంటుందని.. ఆర్ఆర్ మాత్రం పగిలిపోయిందంటూ కామెంట్స్ పెడుతున్నారు.

డైరెక్టర్ వివేక్ స్క్రీన్ ప్లే మరీ అంత గొప్పగా ఏమీ లేదు.. ఎస్ జే సూర్య, నానిల కోసం ఈ సినిమాను థియేటర్లో చూడాల్సిందే.. ఇంటర్వెల్ బ్యాంగ్ మాత్రం బాగుంది.. పోతారు.. మొత్తం పోతారు.. ఇక సెకండాఫ్ వచ్చే సరికి కాస్త బోరింగ్ అనిపించిందట. మాస్‌ను మాత్రం ఎంటర్టైన్ చేస్తుందట..బీజీఎం మాత్రం ప్రత్యేకంగా ఆకట్టుకుంటుందంటున్నారు.

Read Also:Komatireddy Venkat Reddy: నల్గొండ నియోజకవర్గంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పర్యటన..

ట్విట్టర్‌లో పూర్తిగా పాజిటివ్ టాక్ మాత్రమే కాకుండా నెగెటివ్ కూడా కనిపిస్తోంది. సినిమాను చూసి కామెంట్ చేస్తున్నారో.. లేక ఏదో ఒక సెర్చ్ వస్తుందని ఇలా కామెంట్ చేస్తున్నారో తెలియడం లేదు. కానీ పాజిటివ్, నెగెటివ్ కామెంట్లు అయితే కనిపిస్తున్నాయి. మరోసారి నాని, హీరోయిన్ ప్రియాంక, వివేక్ ఆత్రేయలకు హిట్ పడుతుందేమో చూడాలి.