Nani: నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుస సినీమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఈయన తాజాగా సరిపోదా శనివారం అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా నేడు విడుదల అయింది. ఇక ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా నాని పెద్ద ఎత్తున ఇంటర్వ్యూలకు హాజరవుతూ సందడి చేశారు.

ఇదిలా ఉండగా ఇటీవల నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన తాజా చిత్రం కల్కి. ఈ సినిమాలో కల్కి పాత్రలో ప్రభాస్ నటిస్తారని అంత భావించారు. కానీ ఆయన మాత్రం కర్ణుడి పాత్రలో నటించారు. దీంతో కల్కి ఎవరు అనే విషయంపై ఆసక్తి నెలకొంది. ఈ సినిమాలో ఎంతోమంది సెలబ్రిటీలు భాగమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే నవీన్ పోలిశెట్టి నాని ఎందుకు మీ సినిమాలో కనిపించలేదు అనే ప్రశ్న డైరెక్టర్ కు ఎదురయింది.

ఈ ప్రశ్నకు నాగ్ అశ్విని సమాధానం చెబుతూ పార్ట్ 2 రాబోతోంది కదా అందులో తప్పకుండా నవీన్ పోలిశెట్టి అలాగే నాని కనిపించబోతున్నారని ఈయన క్లారిటీ ఇచ్చారు. దీంతో కల్కి పాత్రలో నాని కనిపించబోతున్నారనే వార్త వైరల్ అయింది. అయితే ఈ వార్తల పై నాని సరిపోదా శనివారం సినిమా ప్రమోషన్లలో క్లారిటీ ఇచ్చారు..

ఈ వార్తలలో నిజం లేదు..
ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ ఒకప్పుడు సోషల్ మీడియాలో ఏదైనా ఒక వార్త వచ్చింది అంటే ఆ వార్త నిజమా కాదా అని తెలుసుకొని మీడియా వారు ప్రచారం చేసేవారు. ప్రస్తుత కాలంలో మీడియా కూడా సోషల్ మీడియా ట్రాప్ లో పడిందని తెలిపారు. సోషల్ మీడియాలో ఒక పోస్ట్ ఏదైనా వస్తే అదే నిజమని భావిస్తుంటారు ఇలాంటి వార్తలు ఎక్కడి నుంచి సృష్టిస్తారో అర్థం కాదని తెలిపారు. ఇక నన్ను కల్కి టీం నుంచి ఎవరు వచ్చి ఇప్పటివరకు సంప్రదించలేదని, నేను కల్కిగా నటించడం లేదు అంటూ క్లారిటీ ఇచ్చారు..