Nagachaitanya: నటుడు నాగచైతన్య నటి శోభితను రెండో పెళ్లి చేసుకోబోతున్న సంగతి మనకు తెలిసిందే. సమంతకు విడాకులు ఇచ్చిన తర్వాత నాగచైతన్య శోభిత ప్రేమలో పడ్డారు అయితే వీరి ప్రేమ విషయాన్ని పెద్దలకు తెలియజేయడం పెద్దల సమక్షంలో ఇటీవల నిశ్చితార్థం చేసుకోవడం జరిగింది. ఈ ఎడాది చివరన లేదా వచ్చేయడాది మొదట్లో వీరి వివాహం జరగబోతుంది.

ఇక తన పెళ్లి ఎక్కడ జరుగుతుందనే విషయాలను త్వరలోనే వెల్లడిస్తానని ఇటీవల ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి హాజరైన చైతన్య తెలిపారు. అయితే తన పెళ్లికి మాత్రం నా మనసుకు దగ్గరైన వారందరూ ఉండాలి అలాగే సాంప్రదాయబద్ధంగా తన పెళ్లి జరగాలని తెలిపారు. ఇకపోతే రిపోర్టర్స్ చైతన్యను ఒక ఆసక్తికరమైన ప్రశ్న అడిగారు.

సమంత నాగచైతన్య ఏ మాయ చేసావే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా సమయంలోనే ప్రేమలో పడటం, పెళ్లి చేసుకోవడం జరిగింది. అలాగే విడాకులు తీసుకొని విడిపోవడం కూడా జరిగింది. ఇక పెళ్లి తర్వాత కూడా చైతన్య సమంత కలిసి పలు సినిమాలలో నటించారు..

శోభితతో సినిమాలు చేస్తారా…
ఇక శోభిత ప్రేమలో పడిన నాగచైతన్య ఇప్పటివరకు ఆమెతో కలిసి ఒక సినిమాలో కూడా నటించలేదు. అయితే భవిష్యత్తులో సమంతతో నటించిన విధంగానే సరైన స్క్రిప్ట్ వస్తే శోభితతో కూడా సినిమాలు చేస్తారా అంటూ ప్రశ్న ఎదురయింది. ఈ ప్రశ్నకు నాగచైతన్య సమాధానం చెబుతూ ప్రస్తుతానికైతే అలాంటి ప్లానింగ్స్ ఏమి లేవని ఈయన తెలిపారు. దీంతో సమంతతో చేసిన విధంగానే శోభిత తాను సినిమాలు చేయననే ఉద్దేశంతోనే ఇలాంటి వ్యాఖ్యలు చేశారా అంటూ అభిమానులు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.