TG విద్య: ‘మానవునిలోని, పిల్లలయందలి అత్యున్నతమైన, శారీరక మానసిక ఆధ్యాత్మిక శక్తులను సమగ్రంగా వెలికి తీయడమే విద్య’ అంటారు గాంధీజీ. పాలమూరులోని నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ కు చెందిన ఓ సామాన్య వ్యక్తిగా గౌరవ ముఖ్యమంత్రి రేవంతన్న మిమ్మల్ని చూసి గర్విస్తూ, ఆనందంతో మీకు నమస్కరిస్తున్నా. రాజకీయాలతో నాకు సంబంధం లేదు కానీ రెండు దశాబ్దాలుగా మీ జీవన ప్రవాహంలో ఎన్నో ఎత్తు పల్లాలు, అవాంతరాలు, విమర్శలు, రాజకీయ వ్యూహాలు, అవమానాలు,వైఫల్యాలను వంటివి తట్టుకోని ఓ సామాన్యుడి స్థాయి నుంచి తెలంగాణ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా ఎదిగిన మీ ప్రయాణం మా అందరికీ ఆసక్తికరం. స్ఫూర్తిదాయకం. తెలంగాణ మన దేశానికి దిక్సూచిగా, మన దేశం ప్రపంచానికి ఆదర్శంగా వుండాలని అందరిలా కోరుకునే సామాన్య సగటు పౌరున్ని నేను. నెల్సన్ మండేలా అన్నట్లు ఈ ప్రపంచాన్ని మార్చగల ఒకే ఒక ఆయుధం విద్య మాత్రమే. తెలంగాణలో విద్యలో మార్పులకు సలహాలు, సూచనలను ఆహ్వానించడం మీ ప్రజాపాలన మార్కు(మార్పు)కు నిదర్శనం.