పై ఫొటోలో క్యూట్‌గా కనిపిస్తోన్న అబ్బాయిని గుర్తు పట్టారా? అతను ఇప్పుడు టాలీవుడ్ లో మోస్ట్ హ్యాండ్సమ్ హీరో.. అమ్మాయిల కలల రాకుమారుడు. ఇటీవలే అతని ట్యాలెంట్ ను చూసి ఒక ప్రముఖ నిర్మాత ఈ హీరోకు ఛార్మింగ్ స్టార్ అనే బిరుదు కూడా ఇచ్చారు. కెరీర్ ప్రారంభంలో పలు సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడీ యాక్టర్. ఆ తర్వాత సోలో హీరోగా సినిమాలు స్టార్ట్ చేయడం మొదలు పెట్టారు. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్నాడు. ముఖ్యంగా ఇతని సినిమాలు కుటుంబ సమేతంగా చూడదగ్గవిగా ఉంటాయి. అందుకే ఫ్యామిలీ ఆడియెన్స్ ఈ హీరోను బాగా ఇష్టపడతారు. గతేడాది పెళ్లి చేసుకున్న ఈ హ్యాండ్సమ్ హీరో కొన్ని నెలల క్రితమూ తండ్రిగా ప్రమోషన్ పొందాడు. ఇటీవలే తన శైలికి తగ్గట్టుగానే మరో ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీతో మన ముందుకొచ్చాడు. ఇందులో ఉప్పెన హీరోయిన్ కృతి శెట్టి శర్వానంద్ పక్కన నటించింది. ఈ పాటికే అర్థమై ఉంటుంది మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో? యస్.. అతను మరెవరో కాదు ఇటీవలే మనమే సినిమాతో మనల్ని పలకరించిన హీరో శర్వానంద్. ఇది అతని చిన్నప్పటి ఫొటో.
ఒకే ఒక జీవితం వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత సుమారు ఏడాదిన్నర పాటు గ్యాప్ తీసుకున్నాడు శర్వానంద్. ఇటీవలే మనమే అనే ఒక యూత్ అండ్ ఫ్యామిలీఎంటర్ టైనర్ సినిమాతో ఆడియెన్స్ ను పలకరించాడు. జూన 7న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ డీసెంట్ హిట్ గా నిలిచింది. కాగా మనమే సినిమా ప్రి రిలీజ్ ఆడియో ఫంక్షన్ లోనే శర్వానంద్ కు ఛార్మింగ్ స్టార అనే బిరుదు ఇచ్చారు ప్రముఖ నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్. ఇక శర్వానంద్ వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే.. రక్షితారెడ్డి అనే సాఫ్ట్ వేర్ ఇంజినీర్ తో 2023 జూన్ లో పెళ్లిపీటలెక్కాడు. వీరికి కొన్నినెలల క్రితమే ఒక బిడ్డ జన్మించింది.
ఇవి కూడా చదవండి
మనమే సినిమాలో శర్వానంద్..
Here’s #Manamey
“Success Celebration Trailer” that encapsulates the Fun, Emotion & Celebration that audiences are enjoying in theatres
– https://t.co/XP8kCYyevXIf you haven’t watched it yet,
Book your tickets for the 𝐁𝐈𝐆𝐆𝐄𝐒𝐓 𝐅𝐀𝐌𝐈𝐋𝐘 𝐄𝐍𝐓𝐄𝐑𝐓𝐀𝐈𝐍𝐄𝐑 of… pic.twitter.com/1G7Lb2H1ZD— Sharwanand (@ImSharwanand) June 16, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి