యంగ్ హీరో కోసం శ్రీకృష్ణుడిగా మహేశ్ బాబు..? | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings

Published on Oct 28, 2024 5:00 PM IST


టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్.రాజమౌళి దర్శకత్వంలో SSMB29 మూవీ కోసం రెడీ అవుతున్నాడు. ఈ సినిమాను అడ్వెంచరస్ చిత్రంగా రాజమౌళి తెరకెక్కించనున్నాడు. దీంతో ఈ సినిమా కోసం మహేశ్ ప్రస్తుతం కొత్త లుక్‌కోసం మేకోవర్ చేస్తున్నాడు. అయితే, ఇప్పుడు మహేశ్ రాజమౌళి సినిమా కంటే ముందే, బిగ్ స్క్రీన్‌పై కనిపించబోతున్నాడని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

అశోక్ గల్లా హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘దేవకీ నందన వాసుదేవ’ చిత్రం ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాకు దర్శకుడు ప్రశాంత్ వర్మ కథను అందించగా, అర్జున్ జంధ్యాల డైరెక్ట్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమాను నవంబర్ 14న రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. అయితే, ఈ సినిమాలో శ్రీకృష్ణుడి పాత్రలో సూపర్ స్టార్ మహేశ్ బాబు కనిపించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇది కేమియో పాత్ర అని.. అందుకే మహేశ్ బాబు ఈ పాత్రలో కనిపించబోతున్నాడని తెలుస్తోంది.

ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. తమ అభిమాన హీరోను మరో 2-3 ఏళ్ల వరకు వెండితెరపై చూడలేమా అని అనుకుంటున్న అభిమానులకు ఇదొక సర్‌ప్రైజ్ న్యూస్ అని చెప్పాలి. మరి ఈ సినిమాలో నిజంగానే మహేశ్ బాబు శ్రీకృష్ణుడిగా కనిపిస్తాడా లేదా అనేది వేచి చూడాలి.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *