‘జై హనుమాన్’ అప్డేట్‌ను రెడీ చేసిన ప్రశాంత్ వర్మ! | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings

టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తన ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో తెరకెక్కించే సినిమాపై ప్రేక్షకుల్లో ఎలాంటి హైప్ క్రియేట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాటిక్ యూనివర్స్ నుండి వచ్చిన ‘హను-మాన్’ మూవీ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘జై హనుమాన్’ కూడా ఉంటుందని ప్రశాంత్ వర్మ గతంలోనే తెలిపాడు.

ఇక ఇప్పటికే ప్రీ-ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ సినిమా నుండి సరికొత్త అప్డేట్‌ను రెడీ చేశాడు ఈ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో 7వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించిన కొత్త అప్డేట్‌ని దీపావళి కానుకగా అక్టోబర్ 30న అనౌన్స్ చేయబోతున్నట్లు దర్శకుడు ప్రశాంత్ వర్మ తాజాగా వెల్లడించారు.

దీంతో ఈ సినిమాపై అప్పుడే ప్రేక్షకుల్లో ఆసక్తి క్రియేట్ అయ్యింది. ఈ సినిమా నుండి రాబోయే కొత్త అప్డేట్ ఏమై ఉంటుందా.. అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. మరి దీపావళి కానుకగా ప్రశాంత్ వర్మ ఇవ్వబోయే ట్రీట్ ఏమిటో తెలియాలంటే అక్టోబర్ 30 వరకు వెయిట్ చేయాల్సిందే.

The post ‘జై హనుమాన్’ అప్డేట్‌ను రెడీ చేసిన ప్రశాంత్ వర్మ! first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *