మెగాస్టార్ చిరంజీవికి ANR నేషనల్ అవార్డ్ ప్రదానం | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings

అక్కినేని కుటుంబ సభ్యులు ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ANR నేషనల్ అవార్డు ప్రదానోత్సవం తాజాగా ఘనంగా జరిగింది. ఈ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమానికి తెలుగు సినిమా పరిశ్రమ నుండి పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు. అటు అక్కినేని కుటుంబ సభ్యులు మొత్తం ఈ వేడుకలో కనిపించారు. ఇక ఈ ప్రతిష్టాత్మకమైన అవార్డును ప్రదానం చేసేందుకు బాలీవుడ్ లెజెండరీ యాక్టర్ అమితాబ్ బచ్చన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా అమితాబ్ బచ్చన్, చిరంజీవి గురించి అక్కినేని నాగార్జున పలు ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నాడు. అటు అక్కినేని నాగేశ్వర రావుతో తనకున్న మంచి స్నేహాన్ని బిగ్ బి అమితాబ్ బచ్చన్ గుర్తుకు చేసుకున్నారు. నాగేశ్వర రావు లాంటి లెజెండ్ తనతో పాటు ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలిచారని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ఈ సందర్భంగా అక్కినేని నాగేశ్వర రావుకి సంబంధించిన పలు జ్ఞాపకాలను ప్లే చేశారు.

ఇందులో అందరినీ కన్నీళ్లు పెట్టుకునేలా చేసింది ఏఎన్నార్ ఐసియులో ఉండగా పంపిన చివరి వాయిస్ మెసేజ్. తన ఆరోగ్యంపై అభిమానులు, కుటుంబ సభ్యులు ఎంతో ఆందోళనగా ఉన్నారని.. తాను కోలుకుంటున్నానని.. అందరి ఆశీర్వాదంతో త్వరలో ఆరోగ్యంగా తిరిగివస్తానని.. మీ ఆశీర్వాదమే నాకు ముఖ్యం.. అని ఏఎన్నార్ తన ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్‌లో పంపిన వాయిస్ మెసేజ్‌కి ఈవెంట్‌లోని అందరూ కన్నీళ్లు పెట్టుకున్నారు.

ఇక తనకు ఈ ప్రతిష్టాత్మకమైన అవార్డును అందించడం సంతోషంగా ఉందని.. తనకు ఇది జీవితకాలం పాటు గుర్తుండిపోతుందని మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. ఇలా ఏఎన్నార్ నేషనల్ అవార్డ్ ప్రదానోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.

The post మెగాస్టార్ చిరంజీవికి ANR నేషనల్ అవార్డ్ ప్రదానం first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *