• సెప్టెంబర్‌ 2న గబ్బర్ సింగ్‌ రీ-రిలీజ్‌
  • మీడియాతో ముచ్చటించిన బండ్ల గణేశ్‌
  • త్రివిక్రమ్‌కు క్షమాపణలు చెప్పిన బండ్ల

Bandla Ganesh About Trivikram Srinivas: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌కు నటుడు, నిర్మాత బండ్ల గణేష్ క్షమాపణలు చెప్పారు. ‘భీమానాయక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ సమయంలో ఎవరో ఒక అభిమాని ఫోన్ చేస్తే ఏదో మూడ్‌లో ఉండి నోరు జారానని, చాలా తప్పు చేశానని తెలిపారు. ‘గబ్బర్‌ సింగ్‌’ సినిమా తనకు రావడానికి కారణం త్రివిక్రమ్‌ అని తెలిపారు. పవన్‌ కల్యాణ్‌, త్రివిక్రమ్‌ అవకాశం ఇచ్చి తన జీవితాన్ని మార్చారని బండ్ల గణేష్ పేర్కొన్నారు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

భీమానాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ సమయంలో బండ్ల గణేష్ ఆడియోలు నెట్టింట వైరల్ అయిన విషయం తెలిసిందే. ఓ అభిమాని మీరు ఫ్రీ రిలీజ్ ఈవెంట్‌కి వస్తున్నారా? లేదా? అని అడిగితే.. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తనను ఈవెంట్‌కు రానివ్వడం లేదని బండ్ల గణేష్ అన్నారు. ఆ వ్యాఖ్యలు చేసింది తాను కాదన్న బండ్ల.. ఆపై ఒప్పేసుకుని క్షమాపణలు చెప్పారు. పవన్‌ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్‌ 2న గబ్బర్ సింగ్‌ రీ-రిలీజ్‌ కానుంది. ఈనేపథ్యంలో డైరెక్టర్ హరీశ్‌ శంకర్‌, చిత్ర నిర్మాత బండ్ల గణేశ్‌ మీడియాతో నేడు ముచ్చటించారు. ఓ ఫిల్మ్ రిపోర్టర్ తీన్ మార్ చిత్రం గురించి అడగగా.. గబ్బర్‌ సింగ్‌ సినిమా అవకాశం ఎలా వచ్చిందో చెబుతూ త్రివిక్రమ్‌కు క్షమాపణలు చెప్పారు.

Also Read: Indian Pitches: ఆ ఆలోచన సరికాదు.. భారత పిచ్‌లపై హర్భజన్‌ సింగ్‌ అసహనం!

పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్‌, హరీశ్‌ శంకర్‌ కాంబోలో వచ్చిన మూవీ గబ్బర్‌ సింగ్‌. 2012లో విడుదలైన ఈ సినిమా పవన్‌ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. అప్పటివరకు వరుస ఫ్లాఫులతో సతమతం అవుతున్న పవన్.. గబ్బర్‌ సింగ్‌తో రేసులోకి వచ్చారు. తాజాగా గబ్బర్‌ సింగ్‌ మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. పవన్‌ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్‌ 2న రీ-రిలీజ్‌ కానుంది.