• పెరుగుతున్న అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదం

  • గుండె జబ్బులు.. మధుమేహం.. క్యాన్సర్ ప్రమాదాల బారిన పడుతున్న చాలా మంది

  • యువత కూడా ఈ సమస్యల బారిన పడుతున్నారు- ఆరోగ్య సంస్థలు

  • సకాలంలో పరిష్కరించి చికిత్స తీసుకుంటే ప్రమాదాల బారి నుంచి బయటపడవచ్చు- నిపుణులు.

దేశంలో అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదం పెరుగుతోంది. గుండె జబ్బులు, మధుమేహం, క్యాన్సర్ ప్రమాదాల బారిన చాలా మంది పడుతున్నారు. ఇవన్నీ అకాల మరణాల ప్రమాదానికి దారితీస్తాయి. యువత కూడా ఈ సమస్యల బారిన పడుతున్నారని ఆరోగ్య సంస్థలు చెబుతున్నాయి. ఈ సమస్యలను సకాలంలో పరిష్కరించి చికిత్స తీసుకుంటే ప్రమాదాల బారి నుంచి బయటపడవచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. దేశంలోని ప్రతి నలుగురిలో ఒకరికి అధిక రక్తపోటు సమస్య ఉండవచ్చునని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. అధిక రక్తపోటు విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే.. నియంత్రణ లేకుండా ఉంటే అది ప్రాణాంతక గుండె సంబంధిత సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది. అధిక రక్తపోటు (రక్తపోటు) సమస్య అందరిలోనూ ఉండవచ్చు. చెక్ చేసుకోవడం చాలా ముఖ్యం.

Cinema Chettu: సినిమా చెట్టుకు కొత్త చిగురు

ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఏం చెప్పిందంటే..?
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక పోస్ట్‌లో.. అధిక రక్తపోటు సమస్యను తరచుగా తేలికగా తీసుకుంటారు. కానీ.. ఇది ఆరోగ్యం తీవ్రంగా ప్రభావితమయ్యే వరకు గుర్తించరు. నిరంతర అనియంత్రిత రక్తపోటు (బీపీ) గుండెపోటు వంటి ప్రాణాంతక పరిస్థితులకు దారి తీస్తుంది. అందుకోసమని.. మీ రక్తపోటును చెక్ చేసుకోండి. అధిక రక్తపోటు వల్ల గుండె జబ్బులే కాకుండా కిడ్నీ, కాలేయం, మెదడుకు సంబంధించిన సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉందని.. అందుకే సకాలంలో నియంత్రణకు చర్యలు తీసుకోవడం చాలా ముఖ్యమని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

అధిక రక్తపోటు కారణంగా గుండెపోటు ప్రమాదం:
అధిక రక్తపోటు వల్ల గుండెపై అదనపు ఒత్తిడిని పెంచుతుంది. దీని వల్ల మయోకార్డియం (గుండె కండరం)లో నిర్మాణాత్మక, క్రియాత్మక మార్పులు ప్రారంభమవుతాయి. ఈ మార్పులలో ఎడమ జఠరిక యొక్క హైపర్ట్రోఫీ.. గుండె వైఫల్యానికి దారితీస్తాయి. అధిక రక్తపోటు కారణంగా.. రక్త నాళాలపై అదనపు ఒత్తిడి ఉంటుంది. అందువల్ల అవి చీలిపోయే ప్రమాదం ఉంటుంది. అధిక రక్తపోటు వల్ల గుండెకు మాత్రమే కాకుండా మెదడుకు కూడా ప్రమాదకరమే. ఎందుకంటే ఇది బ్రెయిన్ స్ట్రోక్ ప్రమాదానికి దారి తీస్తుంది.

రక్తపోటు పెరగడం వల్ల ఈ సమస్యలు వచ్చే ప్రమాదం
గుండెకు మాత్రమే కాకుండా అనేక ఇతర అవయవాలు కూడా ప్రభావితమవుతాయి. రక్తపోటు వల్ల కళ్ల రక్తనాళాలు కూడా దెబ్బతింటాయి. దాని వల్ల అనేక కంటి సంబంధిత వ్యాధులు, దృష్టి తగ్గడం మరియు రెటీనా దెబ్బతినే ప్రమాదం ఉంది. నిరంతరం పెరుగుతున్న రక్తపోటు సమస్య కారణంగా.. మూత్రపిండాలు, కాలేయం వంటి ముఖ్యమైన అవయవాలకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అధిక రక్తపోటు వల్ల అంగస్తంభన (నపుంసకత్వము) ప్రమాదాన్ని కూడా పెంచుతుందని కొన్ని పరిశోధనలు సూచిస్తున్నాయి.

రక్తపోటును ఎలా నియంత్రించాలి..?
అధిక రక్తపోటు సమస్య ఉన్నవారు కచ్చితంగా వైద్యులను సంప్రదించి చికిత్స చేయించుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మందులతో పాటు జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా రక్తపోటు అదుపులో ఉంటుంది.
ఒత్తిడిని తగ్గించాలి. శ్వాస వ్యాయామాలు, ధ్యానం లేదా యోగా ద్వారా ఉపశమనం పొందవచ్చు.
సమతుల్య ఆహారం తీసుకోండి.
సోడియం, కెఫిన్ తీసుకోవడం తగ్గించండి.
ధూమపానం, మద్యం సేవించకూడదు.