• సెప్టెంబరు 2న పవర్ స్టార్ బర్త్ డే
  • రాష్ట్ర వ్యాప్తంగా అభిమానుల భారీ ఏర్పాట్లు
  • కుప్పంలో వినూత్నంగా విషెస్ తెలిపిన చిన్నారులు

సెప్టెంబరు 2న ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయన అభిమానులు రాష్ట్రవ్యాప్తంగా అన్నదాన కార్యక్రమాలు, రక్తదాన కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు. మరోవైపు పవర్ స్టార్ నటించిన గబ్బర్ సింగ్ రీరిలీజ్ చేస్తూ సంబరాలు చేసుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇలా ఎవరికీ తోచిన విధంగా వారు తమ అభిమాన హీరో పుట్టిన రోజు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

Also Read: Nani : సరిపోదా శనివారం కలెక్షన్ల తుఫాన్.. ఆంధ్ర – తెలంగాణలో భారీ వర్షాలు ..

కాగా చిత్తూరు జిల్లా కుప్పానికి కు చెందిన పురుషోత్తం అనే కళాకారుడు డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ బర్త్ డేను వినూత్నంగా నిర్వహిస్తున్నాడు. కుప్పం లోని నోబెల్ స్కూల్ అద్వర్యంలో దాదాపు 800 విద్యార్థులు సమూహారంగా ఏర్పడి పవన్ కళ్యాణ్ ఫోటో ప్రతిబింబించేలా, పోస్టర్ ను, ఒక వీడియోను చిత్రించి పవర్ స్టార్ కు పెద్ద బహుమతి అందించారు. ఈ చిత్రం చూసిన ప్రజలు, అభిమానులు, జనసైనికుల, కార్యకర్తలు అద్భుతంగా ఉందని పురుషోత్తంని అభినందించారు. ఈ వీడియో ని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ షేర్ చేస్తు తమ హీరో పట్ల అభిమానాన్ని చాటుకుంటున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఇదిలా ఉండగా పవన్ బర్త్ డే కానుకగా సెప్టెంబర్ 2న పవన్ సినిమాలకు సంబంధించి పోస్టర్ లు రిలీజ్ చేయబోతున్నారు సదరు చిత్ర నిర్మాతలు. సోషల్ మీడియాలో వైరల్ గ మారిన ఆ వీడియోను ఓ సరి చూసేయండి.