• శాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం అనంతరం డ్రగ్స్ కేసులో జైలుకు రియా

  • 28 రోజులు జైలు జీవితం గడపిన రియా

  • జైలుకు వెళ్లిన సమయంలో నా తల్లిదండ్రులు ఫ్రెండ్స్ తో కలిసి మందేశారు: రియా

Rhea Chakraborty friends dined and drank with her parents: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం అనంతరం డ్రగ్స్ కేసుకు సంబంధించి అతని ప్రియురాలు రియా చక్రవర్తి 2020లో వార్తల్లో నిలిచింది. రియా డ్రగ్స్ కేసులో 28 రోజులు జైలు జీవితం గడపాల్సి వచ్చింది. రియాతో పాటు ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తి కూడా జైలుకు వెళ్లాల్సి వచ్చింది. రియా చక్రవర్తి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన తల్లిదండ్రులు ఈ బ్యాడ్ ఫేజ్ ను ఎలా ఎదుర్కొన్నారో చెప్పుకొచ్చింది. అయితే తాను జైలు నుంచి బయటకు రాగానే ఇంట్లో తల్లిదండ్రులు, స్నేహితుల బరువు పెరగడం చూసి ఆశ్చర్యపోయినట్టు వెల్లడించింది. తాను జైలుకు వెళ్లడం వల్ల కుటుంబసభ్యులు, స్నేహితులు తిండి, పానీయాలపై శ్రద్ధ పెట్టరని భావించినా.. తిరిగి వచ్చే సరికి ఆమెకు ఏదో తేడా కనిపించినట్టు చెప్పుకొచ్చింది. వాస్తవానికి, రియా చక్రవర్తి, సోదరుడు షోవిక్ జైలుకు వెళ్ళిన తర్వాత, వారి స్నేహితులు రియా తల్లిదండ్రులను చూసుకున్నారు.

Vijayawada: కాస్త కనికరం లేకుండా.. రక్షించాలంటే రూ.1500 చెల్లించాల్సిందే!

అలాంటి పరిస్థితుల్లో రియా తల్లిదండ్రులు సరిగ్గా తినేలా ముందు వైన్ తదితరాలు తాగించినట్టు ఆమె వెల్లడించింది. హ్యూమన్స్ ఆఫ్ బాంబేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో, రియా చక్రవర్తి మాట్లాడుతూ, “మేము జైలులో ఉన్నప్పుడు, నా స్నేహితులు చాలా మంది మా నాన్నతో మద్యం సేవించేవారు, ప్రతి రాత్రి అతనితో డిన్నర్ చేసేవారు.” రియా చక్రవర్తి ఇంకా మాట్లాడుతూ, నేను బయటకు వచ్చినప్పుడు, ఫ్రెండ్స్ తో ‘మీరు ఇంత బరువు ఎలా పెరిగారు?’ నేను అక్కడ జైలులో ఉన్నా, మీరు ఇక్కడ ఆహారం తిని బరువు పెరుగుతారా? అని అడిగాను. అయితే వారు ‘అదేం లేదు, మేము అంకుల్, ఆంటీకి ఆహారం ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాము, అందులో భాగంగా వైన్ తాగించేవాళ్ళం, అలా చేయడం వలన వారు కొద్దిగా తినవచ్చని అనుకున్నామని వారు చెప్పినట్టు రియా పేర్కొంది. ఆ బ్యాడ్ ఫేజ్ లో బిగ్ సపోర్ట్ తన స్నేహితులేనని రియా చెప్పుకొచ్చింది. వారంతా ఒక రాయిలా మాకు అండగా నిలిచారని పేర్కొంది.