Pasta: పిల్లలు ఫుడ్ తినే విషయంలో చాలా మారం చేస్తారు. వారికి నచ్చిన వంట చేస్తే తినే పిల్లలు కొందరూ ఉంటారు. నచ్చిన.. నచ్చకపోయినా కొందరూ పిల్లలు అస్సలు ఫుడ్ తినరు. అలాంటి పిల్లలకు ఫుడ్ పెట్టాలంటే తల్లిదండ్రులు ఎంతో ఇబ్బంది పడుతారు. కొన్ని ప్రత్యేకమైన వంట చేసిన పెటితే పిల్లలు ఎంతో సంతోషంగా, ఇష్టంగా తింటారు. అలాంటి వాటిల్లో పాస్తా ఒకటి. దీనిని మాకరోనీ అని కూడా అంటారు. ఇది పిల్లలు రుచికరమైన వంటకంగా చెబుతారు. పిల్లల కోసం ప్రత్యేకంగా ఏదైనా చేయాలనుకుంటే పాస్తా చాలా బెటర్. పిల్లలు ఇష్టమైన ఈ వంటకం ఎలా చేయాలో.. ఇప్పుడు కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో చూద్దాం.

పాస్తా సులభంగా తయారు చేసే విధానం:

  • పిల్లలకు రుచికరమైన, ప్రత్యేకమైనది చేయాలనుకుంటే మాకరోనీని తయారు చేయవచ్చు. పిల్లలు ఈ రుచికరమైన వంటకంగా చెబుతారు.
  • పిల్లలు పాస్తా ఇష్టపడతారు. తక్కువ సమయంలో ఇంట్లోనే తయారుచేసుకోవచ్చు.
  • పాస్తా చేయడానికి ముందుగా పాన్‌లో నీటిని మరిగించాలి. ఈ నీటిలో ఉప్పు, పాస్తా కలపాలి. మరిగిన తర్వాత జల్లెడలో వడకట్టి చల్లార్చాలి.
  • ఒక బాణలిలో వెన్న వేడి చేసి దానికి పాస్తానీ కపాలి. పాస్తానీ బాగా ఉడికిన తర్వాత నచ్చిన అన్ని మసాలా దినుసులను కలపాలి.
  • ఇప్పుడు వండిన పాస్తాని ఒక ప్లేట్‌లో తీసి పిల్లలకు టొమాటో సాస్, టాపింగ్, చీజ్‌తో సహా ఇవ్వాలి.
  • ఇలా చేసి పెడితే పిల్లలు చాలా ఉత్సాహంతో తింటారు. అంతేకాదు ఈ వంటకాన్ని పిల్లల టిఫిన్‌లో కూడా పెట్టవచ్చు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు.

The post Pasta: పిల్లలు అమితంగా ఇష్టపడే పాస్తా.. ఇలా తయారుచేయండి! appeared first on Rtvlive.com.