ఈ వార్తను అనువదించండి:

Khammam: ఖమ్మం వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్‌రెడ్డి సోమవారం పర్యటించారు. ఈ సందర్భంగా వరద బాధిత కుంటుంబాలకు తక్షణ సాయం కింద రూ.10వేలు అందిస్తామని చెప్పారు. ఆవు, గేదెలు మరణిస్తే రూ.50వేలు, గొర్రె, మేకలకు రూ.5వేలు ఇస్తామన్నారు. ఇళ్లకు నష్టం జరిగితే పీఎం ఆవాస్‌ యోజన కింద ఆర్థికసాయం చేస్తామన్నారు. వరదల వల్ల ధ్రువపత్రాలు పోతే మళ్లీ ఇస్తామని తెలిపారు. వరదల వల్ల నష్టపోయిన రైతులకు ప్రతి ఎకరానికి రూ.10వేలు పరిహారం ఇస్తామని, విపత్తులు వచ్చినప్పుడు సాయం చేసేందుకు రాష్ట్రంలోని 8 ప్రాంతాల్లో విపత్తు బృందాలు ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. వరదల సమయంలో బురద రాజకీయాలు సరికాదని, ప్రతిపక్షాలు కూడా ప్రజలకు సాయం చేయాలని పిలుపునిచ్చారు.

పూర్తిగా చదవండి..