• కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల పలు ప్రదేశాలలో వరదలు

  • రెండు తెలుగు రాష్ట్రాలకు సినీ ప్రముఖుల విరాళం

  • ఏపీ-తెలంగాణలకు చెరి 50 లక్షలు-మొత్తం కోటి విరాళం ప్రకటించిన బాలకృష్ణ

Balakrishna Donates 1 Crore to AP-TG CM Relief Funds amid Floods: గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు ప్రదేశాలు వరదలతో విలవిలలాడుతున్నాయి. ప్రజలు ఇబ్బందుల పాలవుతున్న క్రమంలో సినీ ప్రముఖులు రెండు తెలుగు రాష్ట్రాలకు తమకు తోచినంత విరాళం ఇస్తున్నారు. ఇప్పటికే ఆయ్ మూవీ యూనిట్, కల్కి నిర్మాతలు, ఎన్టీఆర్, విశ్వక్ సేన్, దర్శకుడు త్రివిక్రమ్, నిర్మాతలు ఎస్. రాధాకృష్ణ, ఎస్. నాగవంశీ సహా పలువురు సినీ ప్రముఖులు రెండు రాష్ట్రాలకు సహాయం అందించారు. ఇక ఇప్పుడు నందమూరి బాలకృష్ణ కూడా భారీ విరాళాన్ని ప్రకటించారు. ఈమేరకు ఆయన ఒక స్పెషల్ నోట్ కూడా షేర్ చేశారు.

Mohan lal: కేరవాన్లో కెమెరాల కామెంట్స్.. రాధికకి మోహన్‌లాల్ ఫోన్!!

50 ఏళ్ళ క్రితం మా నాన్నగారు నా నుదుటిన దిద్దిన తిలకం ఇంకా మెరుస్తూనే ఉంది, 50 ఏళ్ల నుంచి నా నట ప్రస్థానం సాగుతూనే ఉంది- వెలుగుతూనే ఉంది. తెలుగు భాష ఆశీస్సులతో, తెలుగుజాతి అభిమాన నీరాజనాలతో పెనవేసుకున్న బంధం ఇది.. ఈ రుణం తీరనిది. ఈ జన్మ మీకోసం.. మీ ఆనందం కోసం. నా ఈ ప్రయాణంలో సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ప్రస్తుతం తెలుగు నేలను వరద ముంచెత్తుతోంది. ఈ విపత్కర పరిస్థితుల్లో బాధాతప్త హృదయంతో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.50 లక్షలు., తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.50 లక్షలు నా బాధ్యతగా బాధిత ప్రజల సహాయార్థం విరాళంగా అందిస్తున్నాను అని ప్రకటించారు. రెండు రాష్ట్రాలలో మళ్ళీ అతి త్వరలోనే సాధారణ పరిస్థితులు నెలకొనాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నానని అంటూ ఆయన పేర్కొన్నారు.