• వర్షాలతో రెండు తెలుగు రాష్ట్రాలు అల్లకల్లోలం
  • ముంచెత్తిన వర్షాలు.. ఎటు చుసిన వరదలు
  • భాద్యతగా ముందుకు వచ్చిన చిత్ర పరిశ్రమ

ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలు కారణంగా అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణ రెండు రాష్ట్రాలలో భారీ వరదలు సంభవించాయి. ప్రజలకు తినడానికి తిండి, తాగడానికి మంచి లేక అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వం సహాయక చర్యలు ముమ్మరం చేసింది. ఈ నేపధ్యంలో వరద భాదితుల సహాయార్థం కనీస అవసరాలు తీర్చేందుకు తెలుగు సినీ పరిశ్రమ ముందడుగు వేసింది. జూనియర్ ఎన్టీయార్, పవన్ కళ్యాణ్, అశ్వనీదత్, మహేశ్ బాబు, విశ్వక్ సేన్ ఇలా ఒక్కొక్కరు రెండు తెలుగు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్ కు భారీగా ఆర్థిక సాయం ప్రకటించారు.

Also Read: Tollywood : వరద భాదితులకు అండగా టాలీవుడ్.. ఎవరెవరు ఎంతెంత ఇచ్చారంటే..?

తాజగా టాలీవుడ్ మెగాస్టార్ కొణిదెల చిరంజీవి వరద బాధితుల సహాయార్థం భారీ విరాళం ప్రకటించారు. ఇందుకు సంబంధించి మెగాస్టార్ వ్యక్తిగత ‘X’ ఖాతాలో ” తెలుగు రాష్ట్రాల్లో వరద ప్రభావం వల్ల ప్రజలకు కలిగిన, కలుగుతున్న కష్టాలు నన్ను కలిచివేస్తున్నాయి. పదుల సంఖ్యలో అమాయక ప్రాణాలు కోల్పోవడం ఎంతో విషాదకరం. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల నిర్దేశంలో రెండు ప్రభుత్వాలు శాయశక్తులా పరిస్థితిని మెరుగు పరచడానికి కృషి చేస్తున్నాయి. మనందరం ఏదో విధంగా సహాయక చర్యల్లో పాలుపంచుకోవాల్సిన అవసరం వుంది. ఈ ప్రక్రియలో భాగంగా రెండు రాష్ట్రాల లో ప్రజల ఉపశమనానికి తోడ్పాటుగా నా వంతు కోటి రూపాయలు (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ కు చెరో రూ. 50 లక్షలు) విరాళంగా ప్రకటిస్తున్నాను. ఈ విపత్కర పరిస్థితులు తొందరగా తొలగిపోవాలని, ప్రజలంతా సురక్షితంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను” అని పోస్ట్ చేసారు చిరు.