Viswam: ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో దర్శకుడు శ్రీనువైట్ల ఒకరు. ఈయన డైరెక్షన్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అయితే శ్రీను వైట్ల తన సినిమాల విషయంలో ఒకే తరహా జానర్ లో ప్రేక్షకుల ముందుకు రావడం వల్ల ఆయన సినిమాలు పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి.

మహేష్ బాబు హీరోగా నటించిన ఆగడు సినిమా సమయంలోనే ఆయనకు డేంజర్ బెల్స్ మోగినప్పటికీ పెద్దగా శ్రీను వైట్ల గుర్తించలేకపోయారు అనంతరం ఈయన డైరెక్షన్లో వచ్చిన సినిమాలన్నీ కూడా ఒకే తరహా కామెడీ సన్నివేశాలు ఉండడంతో ఈయనకు పూర్తిగా అవకాశాలు కూడా దూరమయ్యాయి దీంతో కొంతకాలం పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు.

ఇకపోతే ప్రస్తుతం గోపీచంద్ హీరోగా విశ్వం అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సినిమా అక్టోబర్ 11వ తేదీ విడుదల కానుంది అయితే తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ విడుదల చేశారు. ఈ టీజర్ పట్ల నేటిజన్స్ విభిన్న రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. శ్రీను వైట్ల గతంలో చేసిన తప్పే మళ్ళీ మళ్ళీ చేస్తున్నారని ఇప్పటికి కూడా ఆయన తన తప్పును గుర్తుంచలేకపోతున్నారంటూ కామెంట్ చేస్తున్నారు.

విశ్వం టీజర్..

ఇటీవల గోపీచంద్ హీరోగా నటించిన విశ్వం సినిమా టీజర్ గతంలో శ్రీను వైట్ల డైరెక్షన్లో వచ్చిన దూకుడు, వెంకీ, ఆగడు సినిమాలోని కొన్ని సన్నివేశాలను తీసి విశ్వం సినిమాలో మిక్స్ చేసినట్టు ఉందని ఈ సినిమా టీజర్ చూస్తుంటే ఆ సినిమాలే గుర్తుకు వస్తున్నాయి అంటూ కామెంట్ లు చేస్తున్నారు. విశ్వం సినిమా సక్సెస్ అవ్వడం శ్రీనువైట్లకి ఎంత అవసరమో గోపీచంద్ కి కూడా అంతే అవసరం. మరి ఈ సినిమా విషయంలో వీరిద్దరూ ఎలాంటి సక్సెస్ అందుకుంటారనేది తెలియాల్సి ఉంది.