Balakrishna: సినిమా ఇండస్ట్రీలో ఒక హీరో కోసం రాసుకున్న కథతో మరొక హీరో సినిమా చేయటం అనేది సర్వసాధారణంగా జరుగుతుంది. ఇలా ఎంతోమంది స్టార్ హీరోల సినిమాలు వద్దనుకొని బ్లాక్ బస్టర్ సినిమాలను మిస్ చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. అయితే మరి కొన్నిసార్లు ఈ సినిమా చేయకపోవడమే మంచిది అనుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి.

ఇకపోతే బాలకృష్ణ హీరోగా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించారు. అయితే ఈయన 5 మంది హీరోలు రిజెక్ట్ చేసిన కథతో సినిమా చేయటం విశేషం. మరి ఆ సినిమా ఏంటి ఎందుకు ఆ హీరోలందరూ రిజెక్ట్ చేశారనే విషయాన్ని వస్తే.. మురళీమోహన్ రావు దర్శకత్వంలో బాలకృష్ణ విజయశాంతి జంటగా సురేష్ ప్రొడక్షన్ బ్యానర్ పై రామానాయుడు నిర్మించిన చిత్రం కథానాయకుడు.

1984 వ సంవత్సరంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా కథతో మురళీ మోహనరావు ముందుగా చిరంజీవి వద్దకు వెళ్లారట అంతకుముందే ఈయన చిరంజీవితో సంఘర్షణ అనే సినిమా చేసి హిట్ కొట్టడంతో తిరిగి మరోసారి చిరంజీవి వద్దకు వెళ్లి కథానాయకుడు సినిమా కథ వినిపించారు. అయితే ఇందులో హీరో పాత్ర కంటే నటి శారద పాత్ర డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో చిరంజీవి ఈ సినిమాని రిజెక్ట్ చేశారు.

ఈ విధంగా చిరంజీవి రిజెక్ట్ చేయడంతో మురళీ మోహనరావు అనంతరం కృష్ణ వద్దకు వెళ్లారు. కృష్ణ కూడా ఈ సినిమాని రిజెక్ట్ చేశారు. ఇక కృష్ణ తరువాత కృష్ణంరాజు, సుమన్, రమేష్ వంటి హీరోల వద్దకు వెళ్ళగా వాళ్ళు కూడా ఈ సినిమాని రిజెక్ట్ చేశారు. అయితే చివరి ప్రయత్నంగా బాలయ్యను కలవాలని నిర్ణయించుకున్నారట ఆయన కూడా ఈ సినిమాని రిజెక్ట్ చేస్తే ఈ సినిమా కథను పక్కన పెట్టేయాలని భావించారు.

హిందీలో రీమేక్..
ఇక బాలకృష్ణను కలిసిన మురళీ మోహనరావు ఈ సినిమా కథను వివరించగా ఈ సినిమా కథ నచ్చి బాలయ్య కమిట్ అయ్యారు.1984లో ప‌ట్టాలెక్కిన క‌థానాయ‌కుడు.. అదే ఏడాది డిసెంబ‌ర్ 18న విడుద‌లై సూపర్ హిట్ సినిమాగా నిలిచింది. అంతే కాకుండా ఈ సినిమాని హిందీలో దిల్ వాలా పేరుతో విడుదల చేయటం విశేషం. ఇలా ఈ సినిమాని మిస్ చేసుకుని ఈ హీరోలందరూ కూడా తప్పు చేశారని బాలయ్య మాత్రం మంచి సక్సెస్ అందుకున్నారనే చెప్పాలి.