Teacher’s Day 2024: తల్లిదండ్రుల తర్వాత పిల్లల జీవితంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన వ్యక్తి గురువు. విద్యార్థులు తప్పులను సరిద్దిద్ది వారిని సన్మార్గంలో నడిపించడంతో పాటు వారిని సమాజంలో ఉన్నతమైన వ్యక్తులుగా తీర్చిదిద్దేవాడు గురువు. అలాంటి గురువులకు కృతజ్ఞతగా ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటారు. భారత దేశంలో ప్రతీ సంవత్సరం సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటారు.

సెప్టెంబర్ 5న మాత్రమే ఎందుకు జరుపుకుంటారు..?

భారతదేశ రెండవ రాష్ట్రపతి, గొప్ప ఉపాధ్యాయుడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యా రంగంలో చేసిన అత్యుత్తమైన కృషి, సహకారానికి గౌరవంగా అయన జయంతిని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటారు. అందుకే ప్రతీ సంవత్సరం సెప్టెంబర్ 5న పాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటారు. విద్యా రంగంలో రాధాకృష్ణన్ ఆలోచనలు భారతీయ విద్యా వ్యవస్థను ప్రభావితం చేశాయి.

ఉపాధ్యాయ దినోత్సవం ప్రాముఖ్యత

ఈ ప్రత్యేకమైన రోజున దేశవ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలలు, ఇతర విద్యాసంస్థలు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్‌కు నివాళులర్పించి ఉపాధ్యాయ దినోత్సవాన్ని సెలెబ్రేట్ చేసుకుంటారు. అంతే కాదు శిష్యులు తమ గురువుల పట్ల గురుభక్తిని చాటుకుంటారు. గురువులకు కృతజ్ఞతలు చెప్పడంతో పాటు వారికి బహుమతులు అందజేసి వారి ఆశీర్వాదాలు పొందుతారు.

Also Read: Deepika Padukone: దీపికా మెటర్నిటీ షూట్.. ఫొటోలకు సినీ తారలు లైకులు..! – Rtvlive.com

The post Teacher’s Day 2024: హ్యాపీ టీచర్స్ డే..! appeared first on Rtvlive.com.