Tollywood Director: ఒక సినిమా మంచి సక్సెస్ కావాలని, ప్రేక్షకులను ఆకట్టుకోవాలని దర్శక నిర్మాతలు కొన్ని వందల కోట్లు ఖర్చు చేసి సినిమాలను చేస్తూ ఉంటారు. ఇలా తమ సినిమా ప్రతి ఒక్కరికి నచ్చాలని చిత్ర బృందం రాత్రి పగలు అని తేడా లేకుండా కష్టపడుతూ ఒక సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తారు. అయితే వచ్చిన సినిమాలన్నీ కూడా మంచి సక్సెస్ అవ్వాలని లేదు.

కొన్ని సినిమాలు చిన్న బడ్జెట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకుంటాయి. మరికొన్ని సినిమాలు వందల కోట్ల బడ్జెట్ పెట్టిన అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమవుతూ ఉంటాయి. ఇలా ఒక సినిమా సక్సెస్ అవ్వలేదు అంటే అందుకు ఎన్నో కారణాలు ఉంటాయని చెప్పాలి. ఇలా సినిమా డిజాస్టర్ అయితే ఎంతో మంది హీరోలు, దర్శకులు రెమ్యూనరేషన్ వెనక్కిచ్చిన సందర్భాలను చాలా చూసాం.

తాజాగా డైరెక్టర్ హరీష్ శంకర్ సైతం రవితేజతో చేసిన మిస్టర్ బచ్చన్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఎన్నో అంచనాల నడుమ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా విడుదలకు ముందు సుమారు 30 కోట్లకు పైగా బిజినెస్ జరుపుకుంది అయితే ఈ సినిమా ఆగస్టు 15వ తేదీ విడుదల ఇప్పటివరకు కేవలం 10 కోట్ల కలెక్షన్స్ మాత్రమే రాబట్టింది.

కోట్లలో నష్టాలు..
ఈ సినిమా సుమారు 20 కోట్లకు పైగా నిర్మాతలకు నష్టాలను తీసుకువచ్చిన నేపథ్యంలో ఈ సినిమా కోసం 6 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్న డైరెక్టర్ హరీష్ శంకర్ నిర్మాతకు రెండు కోట్ల రూపాయలు వెనక్కి ఇచ్చారని తెలుస్తోంది. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా బాలీవుడ్ సూపర్ హిట్ చిత్రంగా వచ్చింది. అయితే ఇందులో మెయిన్ సన్నివేశాలను మార్పులు చేయడంతో ఈ సినిమా భారీ స్థాయిలో నెగిటివ్ టాక్ సొంతం చేసుకుంది. మొత్తానికి ఈ సినిమా డిజాస్టర్ కావడంతో హరీష్ శంకర్ తన రెమ్యూనరేషన్ వెనక్కి ఇచ్చారని తెలిసి అందరూ షాక్ అవుతున్నారు.