ఈ వార్తను అనువదించండి:

హైదరాబాద్: హైడ్రా దెబ్బకు హైదరాబాదీల ట్రెండ్ మారిపోతుంది. నగరంలో ఇల్లు, అపార్ట్ మెంట్స్, ఫ్లాట్స్ కొనేవారు ఆహ్లాదకరమైన వాతావరణానికే మొగ్గుచూపుతుంటారు. ముఖ్యంగా చెరువులు, లేక్ వ్యూ పాయింట్స్ దగ్గర, కాంక్రిట్‌కు దూరంగా ఉండాలని వెతికి మరీ తీసుకుంటారు. కానీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీసుకొచ్చిన హైడ్రా దెబ్బతో జనాల లెక్కలు మారిపోయాయి. ‘లేక్‌ వ్యూ’ అంటే చాలు అబ్బో మాకొద్దు బాబోయ్ అంటూ దండం పెట్టేస్తున్నారు. కొన్ని అపార్ట్స్ మెంట్స్ పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. ఎఫ్‌టీఎల్‌ పరిధిలో కట్టిన అపార్ట్‌మెంట్స్ కావొచ్చనే భయంతో జనాలు కన్నెత్తి కూడా చూడట్లేదు. దీంతో అలర్ట్ అయిన బిల్డర్లు ‘గార్డెన్‌ ఫేసింగ్‌ ఫ్లాట్‌’ అనే ప్రచారం మొదలుపెట్టడం విశేషం.

పూర్తిగా చదవండి..