• వరద బాధితులకు టాలీవుడ్ అండ
  • ఆపద సమయంలో అండగా నిలిచిన చిత్రపరిశ్రమ
  • రెండు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్ కు ఆర్ధిక విరాళం

ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలు కారణంగా అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణ రెండు రాష్ట్రాలలో భారీ వరదలు సంభవించాయి. ప్రజలకు తినడానికి తిండి, తాగడానికి మంచి లేక అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వం సహాయక చర్యలు ముమ్మరం చేసింది. ఈ నేపధ్యంలో వరద భాదితుల సహాయార్థం కనీస అవసరాలు తీర్చేందుకు తెలుగు సినీ పరిశ్రమ ముందడుగు వేసింది. జూనియర్ ఎన్టీయార్, పవన్ కళ్యాణ్, అశ్వనీదత్, మహేశ్ బాబు, విశ్వక్ సేన్, అల్లు అర్జున్, రెండు తెలుగు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్ కు భారీగా ఆర్థిక సాయం ప్రకటించారు.

Also Read: CommitteeKurrollu : కమిటీ కుర్రోళ్ళు ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది.. ఎక్కడంటే..?

తాజాగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు తెలుగు రాష్టాల వరద భాదితుల సహాయార్ధం ఒక్కొక్కరికి రూ. 25 లక్షల చొప్పున ఏపీ – టీజీ సీఎం రిలీఫ్ ఫండ్ కు విరాళం అందించారు. టాలీవుడ్ లోని మరొక టాప్ నిర్మాణ సంస్థ మైత్రీమూవీస్ సంస్థ నిర్మాతలు నవీన్ యెర్నేని, యలమంచిలి రవి శంకర్ రెండు రాష్ట్రాలకు కలిపి రూ. 50 లక్షలు విరాళం ప్రకటించారు. ఇక మరొక నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు ఒక్కో స్టేట్ కు రూ. 50 లక్షల చొప్పున రెండు స్టేట్స్ కు కలిపి కోటి రూపాయల ఆర్థిక సాయం ప్రకటించి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది వచ్చిన ఆపద సమయాల్లో ఆదుకునేందుకు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ముందుకు వస్తుందని నిర్మాత సురేష్ బాబు అన్నారు.